)
Blue Aadhaar Card: దేశంలోని ప్రతి ఒక్క భారతీయుడికి యూఐడీఏఐ జారీ చేసే ప్రత్యేక గుర్తింపు కార్డు ఆధార్. 12 అంకెల ఆధార్ కార్డుతో చాలా ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ది పొందాలన్నా లేక ఏ ఇతర పని కోసమైనా ఆధార్ కార్డు తప్పకుండా ఉండాల్సిందే. ఆధార్ కార్డులో విభిన్న రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది బ్లూ ఆధార్ కార్డు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బ్లూ ఆధార్ కార్డు దాదాపుగా సాధారణ ఆధార్ కార్డు లాంటిదే. కానీ చిన్నపిల్లలకు ఇది తప్పనిసరి. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు యూఐడీఏఐ బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తుంది. ఈ కార్డుకు బయోమెట్రిక్ ఉండదు. అందుకే చిన్నారులకు ఉద్దేశించినది. జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు సహాయంతో బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తారు. ఈ కార్డులో కూడా 12 అంకెల ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అందుకే ఈ కార్డుకు బయోమెట్రిక్ ఉండదు. ఐదేళ్ల తరువాత ఈ కార్డు పనిచేయదు. ఐదేళ్ల వయస్సు దాటితే ఈ కార్డును ఆధార్ కేంద్రంలో అప్పగించి కొత్త సాధారణ ఆదార్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డులో ఫోటో కూడా చిన్నప్పటిదే ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook