Boyfriend Girlfriend Video: సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్న తర్వాత వారి బంధంలో ఎన్నో గొడవలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే కొంతమంది. అనూహ్యంగా ఎక్కడపడితే అక్కడ గొడవలు పడి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఆ గొడవలు ఒక్కొక్కసారి ఎంతటికి దారి తీస్తాయి అంటే క్షణికావేషంలో తీసుకొనే నిర్ణయాలు కూడా తీవ్ర దుఃఖానికి గురిచేస్తూ ఉంటాయి.
ఇకపోతే ఇప్పుడు తాజాగా చైనాలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘటన..అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తాజాగా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఇద్దరు ప్రేమికులు ఒక హోటల్ గదిలో గొడవ పడుతూ ఉంటారు.
అతడి ప్రేయసి తన బాయ్ ఫ్రెండ్ ను ఎంత ఆపే ప్రయత్నం చేసినా అతడు బిల్డింగ్ నుంచి దూకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆమె ఎంతో అడ్డుకుంటుంది. అయినా సరే ఆమెను పక్కకు తోసి మరీ అతడు కిటికీలోనుంచి దూకేసాడు. ఈ సంఘటన చూడగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా.. ఆ పక్క ఆ వ్యక్తికి ఏమయింది అని ఆదరణ వ్యక్తం చేశారు.
కట్ చేస్తే నవ్వుల మయం.. వాళ్లు ఇద్దరూ ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ లోనే.. ఆ పక్క కిటికీలో నుంచి అటువైపు దూకేశాడు. అక్కడి నుంచి పారిపోవడం మనం చూడవచ్చు. ఇలా మొత్తానికైతే ఆ సంఘటన మొదట ఆశ్చర్యపరిచినా.. ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి అందరూ నవ్వుకుంటున్నారు. మొత్తానికైతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ప్రతి ఒక్కరు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇది కావాలనే జోక్ గా తీసిన వీడియో అయినా కానీ.. ఇలాంటి సంఘటనలను కూడా ఇలా తీయడం అనేది సరికాదు అని కూడా వాదిస్తున్నారు. మొత్తానికి కారణమేదైనా ఈ ఇంస్టాగ్రామ్ రీల్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
READ ALSO: నేడు ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు..
READ ALSO: నేటి రాశిఫలాలు.. ఆదివారం అమావాస్య ఏ రాశులకు జాగ్రత్త తప్పనిసరి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









