BSNL Recharge Plans: రోజుకు 2 జీబీ డేటా, వాయిస్ కాలింగ్ 425 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఇదే

BSNL Recharge Plans: దేశంలో గత కొద్ది కాలంగా బీఎస్ఎన్ఎల్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2025, 03:08 PM IST
BSNL Recharge Plans: రోజుకు 2 జీబీ డేటా, వాయిస్ కాలింగ్ 425 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఇదే

సుదీర్ఘమైన వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యంతో మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఏ టెలీకం కంపెనీ ఆఫర్ చేయని లాంగ్ వ్యాలిడిటీ అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Add Zee News as a Preferred Source

బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ టారిఫ్ 2399 రూపాయలు. కానీ వ్యాలిడిటీ మాత్రం ఏకంగా 425 రోజులు. అంటే 14 నెలలు. ఏ ఇతర టెలీకం కంపెనీ ఇంత లాంగ్ వ్యాలిడిటీ అందించడం లేదు. అంతేకాకుండా రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. హోలీ పురస్కరించుకుని ఈ ప్లాన్ లాంచ్ చేసింది బీఎస్ఎన్ఎల్. ఈ మధ్య కాలంలో కంపెనీ లాంచ్ చేసిన వివిధ రకాల ప్లాన్స్ కారణంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు గట్టి పోటీ ఎదురైంది. 

తక్కువ టారిఫ్‌తో లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉండటం బీఎస్ఎన్ఎల్ ప్రత్యేకత. హోలీ ధమాకా ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ కొత్తగా ఈ 2399 రూపాయ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రోజుకు 10 ఎస్ఎంఎస్‌లు అంటే మొత్తం 42 వేల 50 మెస్సేజీలు పంపించుకోవచ్చు. ఇక డేటా ఏకంగా 850 జీబీ ఎంజాయ్ చేయవచ్చు. లాంగ్ వ్యాలిడిటీ తక్కువ ఖర్చులో కావాలంటే ఇదే బెస్ట్ ప్లాన్. ఈ ప్లాన్ కావాలంటే నేరుగా బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా యాప్ లేదా యూపీఐ యాప్స్ ద్వారా చేసుకోవచ్చు. త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జి లాంచ్ చేయనుంది. ప్రస్తుతం 4జి నెట్‌వర్క్ లాంచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 

మరో ప్లాన్ కూడా ఉంది. ఇది 1499 రూపాయల టారిఫ్‌తో లభిస్తోంది. ఇది సరిగ్గా ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. ఈ ప్లాన్‌లో డేటా తక్కువ. వాయిస్ కాలింగ్, లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి మంచి ఆప్షన్. మొత్తం 24 జీబీ డేటా అందుతుంది. 

Also read: South Indian Movement: స్టాలిన్ నేతృత్వంలో దక్షిణ ఉద్యమం, కేసీఆర్, జగన్, చంద్రబాబు, రేవంత్‌లకు ఆహ్వానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News