BSNL Plan: బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగిస్తూ డేటా, కాలింగ్ పెద్దగా అవసరం లేనివారికి బెస్ట్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదే 797 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులు ఉంటుంది. అంటే తక్కువ ధరకు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ కావాలంటే ఇదే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.
దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంటే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ టారిఫ్ చాలా తక్కువ. యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. సిమ్ దీర్ఘకాలం యాక్టివ్‌గా ఉండాలంటే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ అవసరం. కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఇలాంటి ప్లాన్స్ అందిస్తోంది. 797 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌లో మొదటి రెండు నెలలు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. డేటా కూడా మొదటి 60 రోజులు రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. అంటే మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో 120 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా మొదటి 60 రోజులు పనిచేస్తుంది.
Also read: Champions Trophy 2025: పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయా, ఇలా జరిగితేనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









