BSNL Very Cheap Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అందిస్తున్న ప్లాన్స్ తో మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు. పెరిగిన టెలికాం ధరల తర్వాత ప్రైవేట్ టెలికాం కంపెనీలు విపరీతంగా మొబైల్ రీఛార్జీ ప్యాక్ ధరలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన భారత్ బీఎస్ఎన్ఎల్‌కు ఎక్కువ మంది యూజర్లు వచ్చి చేరారు. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలు అయినా జియో, ఎయిర్‌టెల్‌కు సైతం గట్టి పోటీ ఇస్తోంది.
బిఎస్ఎన్ఎల్ ఎన్నో రీఛార్జ్ ప్లాక్లను కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ట్రయ్ ఆదేశాల మేరకు ఇటీవల వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కూడా తీసుకోవచ్చింది. ఇది ఫీచర్ ఫోన్ ఉపయోగించే వారికి బంపర్ ఆఫర్. దీంతో అదనంగా డబ్బులు డేటాకు ఖర్చు చేయకుండా కేవలం అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లకు మాత్రమే ఖర్చు చేస్తూ ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు.. ఇది వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న మూడు ప్లాన్స్ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. టెలికాం మార్కెట్లో ప్రైవేటు కంపెనీలకు దీటుగా ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ఏలుతోంది.
బీఎస్ఎన్ఎల్ 150 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 150 రోజుల ప్లాన్ అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఎందుకంటే దీని ధర చాలా తక్కువ కేవలం రూ.390. దీంతో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా నెలపాటు పొందుతారు. ఎలాంటి ఆటంకం లేకుండా కస్టమర్లకు తమ సేవలను అందిస్తుంది. ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ఐదు నెలల నుంచి విపరీతంగా యూజర్లు వినియోగిస్తున్నారు. ఇందులో 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ 160 ప్లాన్
ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అందిస్తున్న 160 డేస్ ప్లాన్ కూడా అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. దీని వ్యాలిడిటీ 160 రోజులపాటు ఉంటుంది. దీని ధర కేవలం రూ. 997 మాత్రమే. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు.. ఇది కాకుండా ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ కూడా ఉచితంగా పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ 180 డేస్ ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో బంపర్ ఆఫర్ 180 డేస్ వ్యాలిడిటీ ప్లాన్. దీని ధర కేవలం రూ.897 మాత్రమే. కానీ వ్యాలిడిటీ మాత్రం 180 రోజులు వర్తిస్తుంది. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవడంతో పాటు 90 జీబీ డేటా పొందుతారు. ఇందులో మీరు అపరిమితంగా 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా మీ సొంతం బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్స్ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు చమటలు పట్టిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









