Central Government Employees Health Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ వచ్చే ఏడాదిలో 8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission Updates) సీజీహెచ్‌ఎస్ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో..! సిఫార్సులు అమలు చేయనుంది. ఇందుకోసం కమిటీ సభ్యులను ఈ నెలలోనే నియమించే అవకాశం కనిపిస్తోంది. సభ్యుల నియామకం పూర్తయిన తరువాత రాబోయే కమిషన్ ప్రస్తుత జీతాలు, పెన్షన్ నిర్మాణాలను సమీక్షించనుంది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను కలిగించే విధంగా సిఫార్సులను సమర్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేయకపోయినా.. కేంద్ర ప్రభుత్వం తెరవెనుక కసరత్తు చేస్తోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు ఉంచుతున్నారు. తమకు అనుకూలమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పరిగణించాలని కోరుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్కేళ్లను నిర్ణయిస్తారు.
ఉద్యోగులకు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం CGHS స్థానంలో ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త స్కీమ్ ఆరోగ్య బీమా పథకం (CGEPHIS) ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) CGEPHIS అమలులో కీలక పాత్ర పోషించనుంది. దీనిని ఎంపిక చేసిన IRDAI- లైసెన్స్ పొందిన బీమా కంపెనీల ద్వారా నిర్వహించే ఛాన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా ఏళ్ల నుంచి CGHS డిఫాల్ట్ హెల్త్ కవరేజీగా ఉంది. 5వ, 6వ, 7వ వేతన కమిషన్లు CGHS నే సిఫార్సు చేశాయి. త్వరలోనే కొత్త పే కమిషన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో CGEPHIS చర్చపై జరుగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా విస్తృతమైన, ఎక్కువ నగదు రహిత కవరేజీని కల్పిస్తుందని చెబుతున్నారు.
కొత్త నియామకాలను తప్పనిసరిగా బీమా నమూనా కింద చేర్చాలని గతంలో 6వ వేతన కమిషన్ సిఫార్సు చేసింది. ఆ తరువాత 7వ వేతన సంఘం సిఫార్సులలో CGHS-సంబంధిత ఆసుపత్రులను తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు విస్తరించాలని చేర్చారు. ఇక 8వ వేతన సంఘంలో బీమా ఆధారిత పథకాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. నమోదు, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను మరింత సులభతరం చేయడానికి అమలు కోసం SEBI తరహా నియంత్రణ చట్టాన్ని తీసుకువరావచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి CGEPHIS పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఉద్యోగ సంఘాలు, ఆర్థిక నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









