DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

Bumper Jackpot To Govt Employees Cabinet Approves 5 Percent DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి లభించబోతున్నది. ఏకంగా ఐదు శాతం కరువు భత్యం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాలకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించినుంది. డీఏ పెంపునకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 9, 2025, 10:56 PM IST
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

Govt Employees DA Hike: ప్రభుత్వపరంగా దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఆర్థికయేతర ప్రయోజనాలు దక్కకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీవనం భారంగా మారుతోంది. ఉద్యోగులకు సంబంధించి కీలకమైనది కరువు భత్యం (డీఏ). వేతనంలో భారీగా మార్పు చేసే డీఏపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆశల్లో ఉంటాయి. అలాంటి ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా ఐదు శాతం డీఏ పెంపునకు ఆమోద ముద్ర వేసింది. అయితే డీఏ పెంపు ప్రకటించింనది తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కాదు. బిహార్‌ ప్రభుత్వం ఉద్యోగులకు గిఫ్ట్‌ ఇచ్చింది.

Add Zee News as a Preferred Source

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి పదో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు ఐదు శాతం డీఏ పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా డీఆర్‌ అదే స్థాయిలో ప్రభుత్వం పెంచుతూ అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు

పాట్నాలో మంగళవారం నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 అంశాలపై కీలక చర్చ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి కీలక నిర్ణయం ఉంది. అదే కరువు భత్యం పెంపు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం (డీఏ)ని 5 శాతం పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యంలో 5 శాతం పెంపును మంత్రివర్గం ఆమోదించింది. పెంచిన కరువు భత్యం జూలై 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది.

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

డీఏ పెంపు ఇలా..
ఆరో కేంద్ర వేతన స్కేల్ కింద జీతం, పెన్షన్ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 252 శాతానికి బదులుగా 257 శాతం డీఏ పొందుతారు. 
ఐదో కేంద్ర వేతన స్కేల్ కింద జీతం, పెన్షన్ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 466 శాతానికి బదులుగా 474 శాతం డీఏ లభిస్తుంది.

అత్యధిక పెండింగ్ లు ఇక్కడే!
ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశం కరువు భత్యం. అయితే దేశంలోనే అత్యధికంగా డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డీఏలు ప్రకటించాయి. ఇటీవల దసరా, దీపావళికి కరువు భత్యం ప్రకటించగా.. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దేశంలో అత్యధికంగా ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. డీఏలు విడుదల కాక ఉద్యోగ వర్గాలు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే భారీ ఉద్యమం చేపట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు సిద్ధమవుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News