CBSE Class 10 Board 2025 Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) పదో పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు కూడా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే, సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాలు మే 20 లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మే నెలలోనే సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా మే నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
2024 మే 13వ తేదీ సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. 2023 లో మే 12వ తేదీ విడుదల చేశారు. అయితే, ఈ ఏడాది బోర్డు ఎప్పుడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తుంది అని అధికారిక ప్రకటన చేయలేదు కానీ, మే నెలలోనే కచ్చితంగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థలు ఎప్పటికప్పుడు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మే తుది వారంలో ఈ సారి పదో తరగతి పరీక్షాఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు results.cbse.ni.in, cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. ఇది కాకుండా డీజీ లాకర్‌లో కూడా బోర్డు సర్టిఫికేట్లను అందుబాటులో ఉంచుతుంది. లేదా ఉమాంగ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
మొదటగా results.cbse.nic.in లేదా cbse.go.in అధికారిక వెబ్‌సై్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత 'CBSE క్లాస్ 10 స్కోర్ కార్డు 2025' పై క్లిక్ చేయాలి
ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌కాపీ అవసరమేలేదు.. ఈ కొత్త యాప్ ఎలా పనిచేస్తుందో చూడండి..
అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. ఆ తర్వాత మార్క్‌షీట్ డౌన్‌లోడ్ చేసి సేవ్ కూడా చేసి పెట్టుకోవచ్చు.
సీబీఎస్‌ఈ పదో తరగతి పాస్ అవ్వాలంటే విద్యార్థులు కనీసం 33 శాతం ప్రతి సబ్జెక్టులో పొందాలి. అయితే, ఒక్క మార్కు తక్కువ వచ్చిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ గ్రేస్ మార్కులను అవార్డు చేస్తుంది.
డీజీ లాకర్..
డిజిటల్ మార్క్‌షీట్, సర్టిఫికేట్లను సీబీఎస్‌ఈ డీజీ లాకర్‌లో కూడా అప్‌లోడ్ చేస్తుంది.సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలను ప్రకటించిన కొన్ని రోజుల్లోనే మార్కుల షీటును కూడా డీజీ లాకర్‌లో అందుబాటులో ఉంటుంది.
డీజీ లాకర్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. అక్కడు 'issued documents' ఎంపిక్ చేయాలి. సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు, సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఈ 3 రోజులు ప్రత్యేక సేవలు రద్దు..
ఇక ఈ మార్కు షీట్‌పై విద్యార్థిపేరు, క్రమ సంఖ్య, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, థీయరీ, ప్రాక్టికల్స్ సబ్జెక్టులవారీగా మార్కులు ఉంటాయి. ఫైనల్ స్టేటస్ పాస్ లేదా ఫెయిల్ కూడా ఉంటుంది. ఇక సీబీఎస్‌ఈ కొత్త పరీక్ష విధానాన్ని కూడా 2025-26లో ప్రారంభించనుంది. అంటే పదో తరగతి చదివే సీబీఎస్‌ఈ విద్యార్థులకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫిబ్రవరీ లేదా ఏప్రిల్ నెలలో ఏదైనా ఒక బోర్డు ఎగ్జామ్ ఎంపిక చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








