Central Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు అంగీకారం తెలిపింది. జనాభా లెక్కలతోపాటు కులగణన చేర్చాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని విమర్శిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో కులగణన చేయగా.. దేశవ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్న విషయ తెలిసిందే. తాజాగా ఆ విషయంపై కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Also Read: Summer Best Tour Places: సమ్మర్ సెలవుల్లో బెస్ట్ టూర్ ప్లేస్‌లు ఇవే.. జీవితంలో మరచిపోరు
రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కలలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపడతామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
Also Read: CM Chandrababu: పది నెలల పాలనలో సీఎం చంద్రబాబు ఫెయిలయ్యారా? పాసయ్యారా?
ఏప్రిల్ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. కులగణన కోసం ఎన్నో ఏళ్లుగా బీసీ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని జనాభా గణన కార్యకలాపాల్లో కులం చేర్చలేదని కేంద్ర మంత్రి చెప్పారు.
'కుల గణన అంశాన్ని మంత్రివర్గంలో పరిశీలిస్తామని 2010లో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేశారు. చాలా రాజకీయ పార్టీలు కులగణను సిఫారసు చేసినా.. కులగణనకు బదులు సర్వే మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సామాజిక వ్యవస్థకు భంగం కలగకుండా చూసేందుకు కులగణనను సర్వేలకు బదులు పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యలపై ఏం చర్చించారని అడగ్గా అలాంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









