Salary and Pension Hike: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందిస్తోంది. 2018 తరువాత తిరిగి జీతభత్యాలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది కూడా రెండేళ్ల ఎరియర్లతో కలిపి అందనున్నాయి. అంటే ఏప్రిల్ నెల జీతం ఒక్కొక్కరికి భారీగా అందనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం జీతభత్యాలు, అలవెన్సులు, అదనపు పెన్షన్ విషయంలో కిలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలకు జీతభత్యాలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దేశంలోని మొత్తం 78 మంది ఎంపీలు, మాజీ ఎంపీలకు ఈ ప్రయోజనం అందనుంది. జీతంతో పాటు రోజువారీ అలవెన్స్, పెన్షన్, అదనపు పెన్షన్ కూడా పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానున్న ఈ నిర్ణయం ప్రకారం ఒక్కొక్క ఎంపీ జీతం 24 వేలు పెరగనుంది. అంటే 1 లక్ష రూపాయల నుంచి 1.24 లక్షలు కానుంది. ఇక డైలీ అలవెన్స్ 2 వేల నుంచి 2500 కు పెరిగింది. ఇక మాజీ ఎంపీల పెన్షన్ కూడా గణనీయంగానే పెరిగింది. 25 వేల నుంచి 31 వేలకు పెన్షన్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జీతాలు, పెన్షన్, అలవెన్సులు పెంచుతూ నోటిఫికేషన్ ఇప్పుడు విడుదలైనా 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఎంపీలు, మాజీ ఎంపీలకు 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ వరకూ ఎరియర్లతో సహా అందనుంది. అంటే ఏప్రిల్ నెలలో రెండేళ్ల ఎరియర్లతో పాటు భారీగా జీతభత్యాలు అందుకోనున్నారు. ఎంపీల జీతం 24 వేలు, పెన్షన్ 500 పెరిగింది. అంటే 24,500 పెరిగింది. రెండేళ్ల ఎరియర్లు అంటే ఒక్కొక్క ఎంపీకు 5,88,000 రూపాయలు అందనున్నాయి. ఇక మాజీ ఎంపీలకు పెన్షన్ ఒక్కొక్కరికి 6 వేలు పెరిగింది. రెండేళ్ల బకాయిలు కలిపి ఒక్కొక్కరికి 1,44,000 రూపాయలు అందనున్నాయి.
Also read: Public Holidays: విద్యార్ధులు, ఉద్యోగులు అందరికీ గుడ్‌న్యూస్, ఏప్రిల్ నెలలో వరుస సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









