Supreme Court: క్రిమినల్ రాజకీయ నేతలకు కేంద్రం నుంచి బిగ్ రిలీఫ్, ఆరేళ్లు చాలని అఫిడవిట్

Supreme Court: దేశంలోని చాలామంది రాజకీయ నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరందరిపై జీవితకాలం వేటు వేస్తే పరిస్థితి ఏంటి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వీరందరికీ ఇప్పుడు గ్రేట్ రిలీఫ్ కలుగుతోంది. ఆశ్చర్యంగా ఉందా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2025, 09:46 AM IST
Supreme Court: క్రిమినల్ రాజకీయ నేతలకు కేంద్రం నుంచి బిగ్ రిలీఫ్, ఆరేళ్లు చాలని అఫిడవిట్

Supreme Court: దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు, దోషులుగా తేలినవాళ్ల సంఖ్య ఎక్కువే. ఇలాంటి నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదనలు చర్చనీయాంశంగా మారాయి. అసలేం జరిగిందంటే

Add Zee News as a Preferred Source

దేశంలో వివిధ క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలంటూ అశ్విని ఉపాధ్యాయ్ ఓ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన విచారణ చేపట్టింది. దోషులుగా తేలిన రాజకీయ నేతలపై ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల నిషేధం సరిపోదని పిటీషనర్ వాదన. ఈ అంశంపై సెక్షన్ 8,9 చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవితకాల నిషేధాన్ని వ్యతిరేకించింది. 

కేంద్రం ఏం చెప్పింది

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి క్రిమినల్ రాజకీయ నేతలకు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవితకాలం నిషేధం విధించాలా వద్దా అనేది పార్లమెంట్ పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసులో పిటీషనల్ ప్రస్తావించిన అంశాలు విస్తృత స్థాయిలో ఉన్నందున పార్లమెంట్ శాసన విధానాలకు లోబడి ఉన్నాయని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191పై పిటీషనర్ ఆధారపడి వాదించడం తప్పని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలో తీసుకునే దోషులుగా తేలిన రాజకీయ నేతలపై ఆరేళ్ల నిషేధం విధించిందని కేంద్రం స్పష్టం చేసింది. జీవితకాల నిషేధం అవసరం లేదని, ఆరేళ్లు సరిపోతుందని తెలిపింది. 

చట్టసభలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేవని భావించినప్పుడు వాటిని రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది తప్ప..చట్టాలు ఎలా చేయాలి, ఎలాంటి మార్పులు చేయాలో చెప్పే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News