Fastag System: మే 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదా, మరి ప్రయాణం చేయాలంటే ఎలా

Fastag System: గత కొద్ది కాలంగా టోల్ ప్లాజాల విషయంలో అస్పష్టత నెలకొంది. టోల్ ప్లాజా విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుండటంతో మే 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2025, 09:47 PM IST
Fastag System: మే 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదా, మరి ప్రయాణం చేయాలంటే ఎలా

Fastag System: జాతీయ రహదారులపై టోల్ ప్లాజా ఫీజులు ప్రస్తుతం ఫాస్టాగ్ విధానంలో వసూలవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా వసూలులో మరో కొత్త విధానం ప్రవేశపెట్టనుంది. దాంతో ఇక మే 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఎంతవరకు నిజమో ఏంటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా ఫీజులు ప్రస్తుతం ఫాస్టాగ్ విధానంలో వసూలు చేస్తున్నారు. అయితే త్వరలో ఈ స్థానంలో కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ విధానం ప్రవేశపెడతామని గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు తాజాగా ఈ కొత్త విధానం మే 1 నుంచి అమల్లోకి రానుందని, ఫాస్టాగ్ ఇక పనిచేయదనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా టోల్ ప్లాజాలు ఇకపై ఉండవనే వార్తలు వస్తున్నాయి. మే 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయకపోతే ప్రయాణాలు ఎలా చేయాలనే ఆందోళన నెలకొంది ప్రజల్లో. అందుకే కేంద్ర రహదారులు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. 

ఈ ఏడాది మే 1 నుంచి ఫాస్టాగ్ వ్యవస్థ పనిచేయదనే వార్తల్ని కేంద్ర మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఫాస్టాగ్ పనిచేయదని, టోల్ ప్లాజాలు ఉండవంటూ ప్రజలు తప్పుదోవ పట్టించే వార్తలు నమ్మవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపులకు ప్రస్తుతం న్న ఫాస్టాగ్ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది. టోల్ ప్లాజాలు కూడా ఉంటాయని వెల్లడించింది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థను టోల్ ప్లాజాల వద్ద పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపింది. ఇది ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. 

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఫాస్టాగ్‌ను ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థతో అనుసంధానించేందుకు హైబ్రిడ్ మోడల్ విధానం ఉపయోగపడనుంది. దీనివల్ల టోల్ వసూలు మరింత సులభమౌతుంది. హై రిజల్యూషన్ కెమేరాలు నెంబర్ ప్లేట్స్ స్కాన్ చేసి టోల్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. అయితే ప్రస్తుతం ఈ విధానం కేవలం పైలట్ దశలో ఉంది. దేశవ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వస్తుందో స్పష్టత లేదు. 

ఫాస్టాగ్ విధానం తొలగించడం లేదని, అది కొనసాగుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫాస్టాగ్ లేదా టోల్ ప్లాజా తొలగింపు వార్తల్ని నమ్మవద్దని మరోసారి ప్రజలకు సూచించింది. 

Also read: AP SSC Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపు ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు, ఇలా చెక్ చేసుకోండి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News