7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వచ్చేస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో డీఏ పెంపు ప్రకటించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2025, 09:22 PM IST
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హోలీ నజరానా అందించేందుకు సిద్ధమౌతోంది. మరో నాలుగైదు రోజుల్లో జనవరి నెల డీఏను ప్రకటించనుందని తెలుస్తోంది. ఈసారి కూడా డీఏ 3 శాతం ఉంటుందని అంచనా ఉంది. డీఏ పెరగడంతో అటు కనీస వేతనం మరి కాస్త పెరగనుంది. 

Add Zee News as a Preferred Source

7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెరుగుతుంటుంది. మొదటిది జనవరి నెలలో కాగా రెండవది జూలై నెలలో ఉంటుంది. గత ఏడాది జూలై నెలలో 3 శాతం డీఏ పెరగడంతో మొత్తం డీఏ 50 నుంచి 53 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రకారం డీఏ పెంపు ఎంతనేది ఆధారపడి ఉంటుంది. ఈసారి కూడా ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జనవరి నెల డీఏ 3 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. త్వరలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే కేంద్ర కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల డీఏ ఎరియర్లతో పాటు మార్చ్ నెల జీతంతో అందుతుంది. అంటే మార్చ్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. 

గత ఏడాది జూలై నెల డీఏ 3 శాతం పెంపు ప్రకటన అక్టోబర్ నెలలో వచ్చింది. జూలై, ఆగస్టు,సెప్టెంబర్ మూడు నెలల ఎరియర్లతో పాటు చెల్లించారు. ఇప్పుడు జనవరి డీఏ పెంపు ప్రకటన తరువాత కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి జీతం నెలకు 540 రూపాయలు పెరగనుంది. అంటే 18 వేల జీతంపై డీఏ రూపంలో 9540 రూపాయలు అందుతోంది. ఇది ఇకపై 10,080 రూపాయలు అవుతుంది. 

ఏఐసీపీఐ ఇండెక్స్ అనేది ప్రతి నెలా కేంద్ర కార్మిక శాఖ జారీ చేస్తుంటుంది. జనవరి నుంచి జూన్ వరకు ఉన్న సూచీ ఆధారంగా జూలై డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. ఇక జూలై నుంచి డిసెంబర్ వరకూ సూచీ ఆధారంగా జనవరి డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి..

Also read: March Holidays: గుడ్‌న్యూస్ బ్యాంకులకు ఆ 4 రోజులు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News