MP Salary Hike: భారీగా పెరిగిన ఎంపీల జీతభత్యాలు, ఒక్కొక్కరికి ఎంతంటే

MP Salary Hike: దేశంలోని ఎంపీలకు గుడ్‌న్యూస్. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభ సభ్యుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అంతకంటే అదృష్టం ఏంటంటే ఏకంగా రెండేళ్ల ఎరియర్లు కూడా అందనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2025, 08:26 PM IST
MP Salary Hike: భారీగా పెరిగిన ఎంపీల జీతభత్యాలు, ఒక్కొక్కరికి ఎంతంటే

MP Salary Hike: పార్లమెంట్ సభ్యుల జీతాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన గెజిట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా జీతాల పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందని గెజిట్ పేర్కొనడంతో ఏకంగా 24 నెలల ఎరియర్లు అందనున్నాయి. ఫలితంగా ఏప్రిల్ నెల జీతం భారీగా అందుకోనున్నారు.

Add Zee News as a Preferred Source

దేశంలోని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఇప్పటి వరకు జీతం 1 లక్ష రూపాయలు కాగా కొత్త జీతం 1.24 లక్షలు లభిస్తుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు 24 వేలు పెరిగింది. ఇది కాకుండా రోజుకు ఇచ్చే 2 వేల అలవెన్స్ కాస్తా 2500 రూపాయలు అయింది. అంటే అలవెన్స్ రూపంలో మరో 75 వేల రూపాయలు లభిస్తాయి. మొత్తం 2 లక్షల రూపాయలు నెలకు తీసుకోనున్నారు. ఇక మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్ కూడా పెరిగింది. ఇప్పటి వరకు నెలకు 25 వేల రూపాయలు పెన్షన్ వచ్చేది. ఏప్రిల్ నుంచి 31 వేలు అందుకోనున్నారు. ఈ పెన్షన్ అనేది సీనియార్టీని బట్టి మారుతుంది. ఒకసారి ఎంపీగా చేసి ఉంటే 31 వేలు లభిస్తుంది. అంతకు మించిన కాలానికి ఏడాదికి 2500 రూపాయలు చొప్పున పెరుగుతుంది. అంటే ఎవరైనా రెండు దఫాలు పని చేసి ఉంటే 31 వేల పెన్షన్‌కు అదనంగా 12500 రూపాయలు లభిస్తాయి. ఇవి కాకుండా పార్లమెంట్ నియోజకవర్గ ఖర్చుల నిమిత్తం నెలకు 70 వేలు ఇస్తారు. ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మరో 60 వేల రూపాయలు చెల్లిస్తారు. ఇక అద్దె అయితే నెలకు గరిష్టంగా 2 లక్షల రూపాయలు ఉంటుంది.

ఈ అలవెన్సులకు టీఏ అదనం. టీఏ అనేది రోడ్డుపై ప్రయాణానికి కిలోమీటర్ 16 రూపాయలు చెల్లిస్తారు. రైలులో అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉచిత ప్రయాణం ఉంటుంది. ఏడాదిలో 34 సార్లు విమాన ప్రయాణం ఉచితంగా చేయవచ్చు. ఈ ఖర్చులకు మెడికల్ అలవెన్సులు, ఉచిత విద్యుత్ , ఉచిత తాగునీటి సౌకర్యం అదనంగా లభిస్తాయి. ఫోన్ బిల్లు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 

గతంలో పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు 2018లో పెంచారు. తిరిగి ఐదేళ్ల తరువాత 2023లో పెంచాల్సి ఉన్నా ఇప్పుడు పెంచారు. గెజిట్ విడుదలైంది ఇప్పుడే కానీ అమలయ్యేది మాత్రం 2023 ఏప్రిల్ 1 నుంచి. 

Also read: AP Government: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఎక్కౌంట్లలో జమ అవుతున్న డబ్బులు మీ ఎక్కౌంట్ చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News