)
Central Government Jobs 2025: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశంలోని ప్రముఖ సహజ వాయువు సంస్థ GAIL (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. మంచి జీతంతో కూడిన ఈ ఉద్యోగాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి.
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: నవంబర్ 24, 2025
చివరి తేది: డిసెంబర్ 23, 2025
GAIL పోస్టుల ఖాళీల వివరాలు..
చీఫ్ మేనేజర్-1
సీనియర్ ఆఫీసర్-5
సీనియర్ ఇంజనీర్-8
ఆఫీసర్-1
దివ్యాంగుల కేటగిరీ-14
విద్యార్హతలు..
సంబంధిత విభాగాల్లో డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు కలిగివుండాలి. అయితే ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలు మారతాయి. ఎంబిఏ, సీఏ, ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలున్నాయి. కనీసం ఒక సంవత్సరం ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇక చీఫ్ మేనేజర్ పదవికి మాత్రం 12 ఏళ్ల అనుభవం కావాలి.
వయో పరిమితి..
పోస్టును బట్టి వయోపరిమితిని కేటాయించారు. సీనియర్ మేనేజర్-గరిష్ఠంగా 46 ఏళ్లు.. సీనియర్ ఆఫీసర్-గరిష్ఠంగా 33 ఏళ్లు.. సీనియర్ ఇంజనీర్-గరిష్ఠంగా 38 ఏళ్లు.. మెడికల్ సర్వీస్ సీనియర్ ఆఫీసర్-గరిష్ఠంగా 42 ఏళ్లు కాగా.. ఎస్సి, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దీంతో గరిష్ఠంగా 56 ఏళ్లలోపు వయసు వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎంపిక విధానం..
విభాగాన్ని బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లాంటి పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు రాతపరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు.
అప్లయ్ చేసుకునే విధానం..
ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు gailonline.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200 (SC/ST/దివ్యాంగులకు మినహాయింపు).
వేతనం వివరాలు..
చీఫ్ మేనేజర్: రూ.90,000-రూ.2,40,000
సీనియర్ ఇంజనీర్/ఆఫీసర్: రూ.60,000-రూ1,80,000
ఆఫీసర్: రూ.50,000-రూ.1,50,000
నెలనెలా సాలరీతో పాటు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook