Aadhaar App: ఇక ఆధార్ కార్డు అవసరం లేదు..అంతా కొత్త ఆధార్ యాప్‌తో అన్ని పనులు

Aadhaar App: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సౌకర్యాలు పెరుగుతున్నాయి. ఆధార్ కార్డుకు సంబంధించి మరో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇకపై ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏకంగా యాప్ మీ చేతిలోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 05:02 PM IST
Aadhaar App: ఇక ఆధార్ కార్డు అవసరం లేదు..అంతా కొత్త ఆధార్ యాప్‌తో అన్ని పనులు

Aadhaar App: డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలకు కీలకమైన గుర్తింపు పత్రంగా మారిన ఆధార్ కార్డును ఇకపై మీరు జేబులో పెట్టుకుని తిరగాల్సిన పని లేదు. ఎప్పుడు కావాలంటే యాప్ ఓపెన్ చేసి ధృవీకరించుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం ఆధార్ కార్డు అన్ని పనులకు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పనులన్నింటికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. బ్యాంకింగ్ పనులు, ట్యాక్స్ చెల్లింపులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, ఆరోగ్య సేవలు ఇలా దేనికైనా సరే ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆధార్ కార్డు దుర్వినియోగం ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మీ ఆధార్ కార్డును మరింత సెక్యూర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానం ప్రవేశపెడుతోంది. ఇప్పుడు కొత్తగా ఆధార్ యాప్ లాంచ్ చేసింది. ఇటీవల జరిగిన ఆధార్ సంవాద్ 3.0 కార్యక్రమంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త ఆధార్ యాప్ ప్రకటించారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. 

కొత్త ఆధార్ కార్డులో ప్రధానంగా డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, ఇన్‌స్టంట్ రికగ్నిషన్ సౌకర్యాలు ఉంటాయి. ఫేస్ అథెంటిఫికేషన్, క్యూఆర్ కోడ్ స్కాన్, రియల్ టైమ్ వెరిఫికేషన్ టెక్నాలజీ ఈ కొత్త యాప్ ప్రత్యేకతలు. ఫేస్ స్కానింగ్ ద్వారా ఆధార్ వివరాలు ధృవీకరించవచ్చు. ఫింగర్ ప్రింట్, ఐరిస్ అవసరం లేదు. మొబైల్ కెమేరా ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. 

హోటల్ రూమ్ బుకింగ్ లేదా ట్రావెలింగ్ ఇతర పనుల కోసం ఆధార్ జిరాక్స్ తీసుకెళ్లాల్సిన పని లేదు. మొబైల్ యాప్ ద్వారా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దీనివల్ల పూర్తి ఆదార్ నెంబర్ ఎవరికీ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ డేటా సెక్యూర్‌గా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారం అనధికారికంగా లీక్ అవదు. డాక్యుమెంట్ ఫోర్జరీ కూడా జరగదు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఆ తరువాత గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ముందుగా మీ మొబైల్‌లో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫేస్ స్కానింగ్ ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఉన్న ప్రదేశంలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఆ తరువాత ఐడీ కోసం సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్ చేయాలి. ఇది యూఐడీఏఐలోని మీ డేటాతో వెరిఫై అవుతుంది. ఆ తరువాత మీక్కావల్సిన సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ కొత్త ఆధార్ యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి సైతం ఆధార్ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది. వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతమౌతుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కస్టమర్ల గుర్తింపు ధృవీకరించవచ్చు. 

Also read: NEET UG 2025: ఆధార్ మ్యాచ్ కాకపోతే నీట్ పరీక్ష వదులుకోవాల్సిందే, తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News