
Aadhaar Card New Rules: భారతదేశ పౌరులకు యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు ఆధార్ కార్డు. ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు ఇది చాలా అవసరం. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ముఖ్యంగా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్ వంటివి తప్పకుండా అప్డేట్ అవాలి.
ఆధార్ కార్డు జారీ ప్రక్రియ విషయంలో యూఐడీఏఐ కీలకమైన మార్పులు చేసింది. వాస్తవానికి చాలా కాలం తరువాత ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఇవి వర్తిస్తాయి. ఆధార్ కార్డు కోసం వేచి చూసే వ్యవధి ఇకపై మారనుంది. అదే సమయంలో ఆధార్ కార్డు అప్డేట్స్ వ్యవధి కూడా మారుతోంది. ఆధార్ సెక్యురిటీని మరింతగా పెంచడం, కచ్చితత్వాన్ని నిర్ధారించడం కోసం ఈ మార్పులు చేపడుతోంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు వారం రోజుల్లోగా ఆధార్ కార్డు పొందగలరు. అయితే ఇప్బుడు ఈ రూల్ మారింది. ఆధార్ కార్డు జారీకు గరిష్టంగా 6 నెలలకు పొడిగించారు. ఆధార్ ధృవీకరణను పటిష్టం చేసేందుకు, దరఖాస్తుదారుల ప్రామాణికతను నిర్ధారించేందుకు, ఫేక్ ఆధార్ అప్లికేషన్లను కనిపెట్టేందుకు ఈ మార్పు అనివార్యమైంది.
18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన భారతీయులు కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే ఈ మార్పు అంటే ఆరు నెలల వ్యవధి వర్తిస్తుంది. పిల్లల కోసం అప్లై చేసుకునేవారికి, ఆధార్ కార్డు అప్డేట్స్కు ఈ మార్పు వర్తించదు. ఆధార కార్డు జారీ చేయడంలో లోపాలను తగ్గించేందుకు, ఆధార్ గుర్తింపుని దుర్వినియోగం చేయకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నియమం తీసుకొచ్చింది.
అదే సమయంలో పాత ఆధార్ కార్డులకు అంటే పదేళ్ల క్రితం జారీ చేసిన కార్డులకు అప్డేట్ తప్పనిసరి. వీటి అప్డేట్ ఆన్లైన్ విధానంలో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా బయోమెట్రిక్ వివరాలు, చిరునామా, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్దికి ఇబ్బంది కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook