Passport changes: ఆ వివరాల్లేకుండా పాస్‌పోర్ట్, ఏయే డాక్యుమెంట్లు అవసరం

Passport changes: పాస్‌పోర్ట్. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సిన డాక్యుమెంట్. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్‌కు సంబంధించి కీలకమైన మార్పులు చేసింది. మీరు కూడా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేస్తుంటే ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2025, 12:46 PM IST
Passport changes: ఆ వివరాల్లేకుండా పాస్‌పోర్ట్, ఏయే డాక్యుమెంట్లు అవసరం

Passport changes: కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ను మరింత సురక్షితం చేస్తోంది. ఇందులో భాగంగా పాస్‌పోర్ట్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చింది. పౌరుల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ కూడా ఇంకా ఈజీ కానుంది. 

Add Zee News as a Preferred Source

విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సిన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. గతంతో పోలిస్తే పాస్‌పోర్ట్ మంజూరయ్యే వ్యవధి చాలా తగ్గిపోయింది. ఎప్పటికప్పుడు పాస్‌పోర్ట్ జారీ విధానం వేగవంతం చేస్తోంది విదేశీ మంత్రిత్వ శాఖ. పాస్‌పోర్ట్ దరఖాస్తు, వెరిఫికేషన్ ప్రక్రియ సులభతరం చేసేందుకు పాస్‌పోర్ట్ సేవే కేంద్రాల సంఖ్య పెంచుతోంది. ప్రస్తుతం 442 పాస్‌పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. రానున్న ఐదేళ్లలో ఈ సంఖ్య 600కు పెరగనుంది. మరో వైపు పాస్‌పోర్ట్‌కు సంబంధించి వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకుండా అందరికీ తెలియకుండా మరింత సురక్షితం చేయనుంది. 

పాస్‌పోర్ట్‌లో కీలక మార్పులు

పాస్‌పోర్ట్‌దారుని తల్లిదండ్రుల పేర్లు చివరి పేజీలో ఉండేవి. కానీ ఇకపై ఆ వివరాలు ముద్రించరు. వ్యక్తిగత డేటాను అనవసరంగా బహిర్గతం కావడాన్ని ఇది నిరోధిస్తుంది. 

వివిధ రకాల పాస్‌పోర్ట్‌లు సులభంగా గుర్తించేందుకు వీలుగా కలర్ కోడింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ అధికారులకు వైట్ కలర్ పాస్‌పోర్టులు, దౌత్యవేత్తలకు రెడ్ కలర్ పాస్‌పోర్టులు జారీ చేస్తారు. ఇక సాధారణ ప్రజలకు ఎప్పటిలానే బ్లూ కలర్ పాస్‌పోర్ట్‌లు ఇస్తారు. 

పాస్‌పోర్ట్ దరఖాస్తుకు కావల్సిన డాక్యుమెంట్లు

అక్టోబర్ 1, 2023 తేదీన లేదా ఆ తరువాత పుట్టిన వ్యక్తులు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని సంబంధిత కార్పొరేషన్ లేదా బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ నుంచి పొందాలి. ఈ తేదీ కంటే ముందు పుట్టిన వ్యక్తులు స్కూల్ టీసీ , స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఐడీ కార్డు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డ్, పే పెన్షన్ ఆర్డర్ వంటి డాక్యుమెంట్స్ సమర్పించవచ్చు.

పాస్‌పోర్ట్ దారుని చిరునామా ఇకపై కన్పించదు. ఆ స్థానంలో బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ వ్యక్తి చిరునామా తెలుసుకోగలుగుతారు. ఇది డేటాను మరింత సురక్షితంగా సులభంగా నిర్వహించేందుకు దోహదపడుతుంది. 

Also read: Champions Trophy 2025 Final: ఇండియా కివీస్ జట్ల బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News