New Helmet Rule: రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. టూ వీలర్ కొనేవారికి ఇప్పుడిక అది తప్పనిసరి అవుతోంది.
హెల్మెట్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలనమైన వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 69 వేలకు పైగా టూ వీలర్ ప్రమాద మరణాలు సంభవిస్తుంటే అందులో 50 శాతం పైగా కేసుల్లో హెల్మెట్ లేకపోవడం గమనార్హం. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి మరణాల శాతం అధికమౌతోంది. ప్రమాదాల్లో బతికి బయటపడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల ప్రమాద మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై టూవీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించడమే కాకుండా టూ వీలర్ కొనేటప్పుడు బైక్‌తో పాటు రెండు హెల్మెట్లు తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకూ టూ వీలర్‌తో పాటు ఒక హెల్మెట్ కొనడం అనివార్యంగా ఉంది. అందుకే చాలా కంపెనీలు హెల్మెట్ ఉచితంగా అందిస్తున్నాయి.
ఇకపై టూ వీలర్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ రెండు ఐఎస్ఐ సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తప్పనిసరిగా చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇకపై టూ వీలర్‌తో పాటు సదరు కంపెనీలు రెండు హెల్మెట్లు విక్రయించడం లేదా ఉచితంగా అందించడం చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనకు దేశంలోని టూ వీలర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో టూ వీలర్‌పై ప్రయాణం చేసే ఇద్దరూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ నిబంధన ఇప్పటికే ఢిల్లీ సహా కొన్ని మెట్రో నగరాల్లో అమలవుతోంది. ఇకపై దేశమంతా వ్యాపించనుంది.
Also read: Holidays April 2025: బ్యాంకులు, స్కూల్స్, ఆఫీసులకు వరుసగా మూడ్రోజులు సెలవులు, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









