EPFO 3.0 Launch: ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఉండేది పీఎఫ్ ఎక్కౌంట్. పీఎఫ్ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ ఎప్పుడూ అప్‌డేట్ చేస్తుంటుంది. పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా విషయంలో నిబంధనలు మారుస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0 లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఖాతాదారులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్స్, డిజిటల్ కరెక్షన్లు, ఏటీఎం విత్‌డ్రాయల్ వంటివి ఉంటాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా తెలిపారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈపీఎఫ్ఓ 3.0 ముఖ్య లక్ష్యంగా ఉంది. అంటే ఇప్పటి వరకూ పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా విషయంలో నెలకొనే దరఖాస్తుల ప్రక్రియ, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటివి ఇకపై ఉండవు. విత్ డ్రాయల్ ప్రక్రియ చాలా వేగవంతమౌతుంది. కేవలం ఓటీపీ ద్వారా పీఎఫ్ ఖాతాలు అప్‌డేట్ చేయవచ్చు.
పీఎఫ్ ఖాతాల్లో ఇప్పటి వరకూ 27 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏకీకృత పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశంలోని ఏ బ్యాంకు ఎక్కౌంట్ లోనుంచైనా పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించనుంది. మొత్తం 78 లక్షల పెన్షనర్లకు లాభం చేకూరనుంది. అంతేకాకుండా ఆయష్మాన్ భారత్ పథకంలో భాగంగా వివిధ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది. అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ ధన్ యోజన సహా వివిధ పథకాలను ఏకీకృతం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈపీఎఫ్ఓ 3.0 మే లేదా జూన్ నాటికి ప్రారంభం కావచ్చు. కొత్త విధానంతో ముందుగా కలిగే ప్రయోజనం ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోగలగడం.
Also read: AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









