Waqf Amendment Bill:పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో నేడు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. దీంతో ఎన్టీఏ కూటమి ఎంపీలంతా సభకు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన ఎంపీలకు సైతం విప్ జారీ చేసింది. లోక్ సభ సమావేశాలకు తప్పక హాజరుకావాలని సూచించింది. ఈ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. లోక్ సభ, రాజ్య సభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉంది. ఈ బిల్లుకు లోక్‌సభలో అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉంది. 233 మంది ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. 11 మంది ఎంపీలు తటస్టంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రాజ్యసభలో ఎన్డీయేకు 122, విపక్షాలకు 116 ఎంపీల బలం ఉంది. దీంతో ఉభయసభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు సులువుగా ఆమోదముద్ర పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.
ఈ సారి తీసుకురాబోతున్న బిల్లులో మహిళలకు కూడా స్థానం కల్పించేలా దాంతో పాటు వక్ఫ్ బోర్డ్ ప్రభుత్వానికి జవాబుదారి తనం ఉండేలా ఈ బిల్లులో కీలక మార్పులతో ఈ బిల్లు ఉండబోతుంది. ఇప్పటికే వక్ఫ్ బోర్డ్ పై ఏర్పాటు చేసిన జేపీసీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ఈ బిల్లును లోక్ సభ స్పీకర్ గతంలోనే తమ నివేదిక ను అందజేసేవారు. మొత్తంగా వక్ఫ్ బోర్డ్ చట్టంలో 40 సవరణలను తీసుకురాబోతున్నట్టు సమాచారం. మన దేశంలో వక్ఫ్ బోర్డ్ ఇష్టారాజ్యం ప్రకారం నడుస్తోంది. ఏదైనా ఆస్తులు వక్ఫ్ తమవని క్లెయిమ్ చేస్తే.. దాన్ని వక్ఫ్ కు సంబంధించిన కోర్టుల్లోనే ఆయా ఆస్తుల యజమానులు తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్బంగా వక్ఫ్ బోర్డ్ కుండే క్రూరమైన హక్కులను కేంద్రం ఈ బిల్లుతో లాగేసుకోబోతుంది. 1995లో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ కు విస్తృత అధికారాలు ఇస్తూ కొత్త వక్ఫ్ చట్టం తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దింది. మన దేశంలో ఆర్మీ, రైల్వే తర్వాత ఎక్కువ ఆస్తులు ఉన్నది వక్ఫ్ బోర్డ్ కే కావడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం కారణంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేయడమే ఆలస్యం.. అటు వంటి ఆస్తులను గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం ఈ చట్టం కారణంగా దుర్లభంగా మారింది. 1954లో అప్పటి ప్రధాన నెహ్రూ ఇక్కడ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన ముస్లిమ్ సమాజం కోసం ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అది మంచిదే అయినా.. కాలక్రమేణా అది దుర్మార్గమైనదిగా మారింది. ముస్లిమ్ వర్గాల కోరిక మేరకే ఈ చట్టంలో కీలక సవరణలకు కేంద్ర నడుం బిగించిన సంగతి తెలిసిందే కదా. ఉభయ సభల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తగిన ఎంపీల బలం ఉండటం మూలానా.. ఈ దుర్మార్గమైన వక్ఫ్ బోర్డ్ చట్టం ప్లేస్ లో కొత్త చట్టం రావడం ఖాయం అంటున్నారు.
ఇక ప్రపంచంలో ఏ ముస్లిమ్ దేశంలో కూడా వక్ఫ్ లాంటి దుర్మార్గమైన చట్టాలు లేవు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయల కోసమే అప్పట్లో కాంగ్రెస్ సర్కారు.. దీనికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని హిందూ సంఘాలు చెబుతూ వస్తున్నాయి. మరోవైపు ముస్లిమ్స్ లోని షియా, పష్మండా వర్గంతో పాటు మరికొన్ని వర్గాలు కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త చట్టంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









