చెన్నై బాబా వికృత లీలలు-ఐదేళ్లుగా ఆ మహిళపై అత్యాచారం-పెళ్లయినా వదల్లేదు...
Chennai godman arrested for rape and impegrant a woman: సత్య నారాయణ్ బాబా ఆమె ఆచూకీ ఎలా తెలుసుకున్నాడో గానీ పెళ్లి తర్వాత కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆశ్రమానికి రాకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు.
Chennai godman arrested for rape and impegrant a woman: చెన్నైకి చెందిన సత్య నారాయణ్ అనే బాబాను, అతన్ని భార్య పుష్పలతను శనివారం (డిసెంబర్ 18) స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. బాబాగా చలామణిలో ఉన్న సత్య నారాయణ్ కొన్నేళ్లుగా ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడుతూ వస్తున్నాడు. గతంలో ఆమెపై అత్యాచారానికి (Chennai Godman Rape) పాల్పడిన ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకుని పెళ్లయ్యాక కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం కూడా దాల్చింది. సత్య నారాయణ్ బాబా వేధింపులు తాళలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అతనిలో మరో కోణం బయటపడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... చెన్నైలోని వినాయకపురంలో 'షిర్డీపురం సర్వశక్తి పీఠం సాయి బాబా కోయిల్' పేరిట సత్య నారాయణ్ (Sathya Narayan Baba) ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 12, 2016న ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన నానమ్మతో కలిసి ఆ ఆశ్రమానికి వెళ్లింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి ఆశ్రమం నుంచి విభూది తీసుకెళ్లి పెడితే బాగవుతుందన్న నమ్మకంతో అక్కడికి వెళ్లింది. విభూది కోసం ఆ బాలికను సత్య నారాయణ్ బాబా భార్య పుష్పలత ఓ గదిలోకి తీసుకెళ్లింది.
అక్కడ ఆమెకు ఒక గ్లాసులో జ్యూస్ ఇచ్చి తాగమని చెప్పింది. ఆ జ్యూస్ తాగాక బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్పృహలోకి వచ్చేసరికి ఒంటిపై దుస్తులు లేకపోగా... తన పక్కనే సత్య నారాయణ్, మరో వ్యక్తి కూడా నగ్నంగా ఉండటాన్ని గమనించింది. ఏం జరిగిందని ఆ బాలిక (Rape on Minor Girl) వారిని ప్రశ్నించగా... నీలోని పాపాలన్నీ పోగొట్టేందుకు పవిత్ర లైంగిక కార్యంలో పాల్గొన్నామని ఆమెను మభ్యపెట్టారు.
ఆ ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్:
అత్యాచార సమయంలో బాలిక ఫోటోలు, వీడియోలు తీసిన సత్య నారాయణ్ బాబా... ఆ తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని బాలికను బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాలిక నానమ్మ 2018లో ఆమెను చెన్నై నుంచి వేరే చోటుకు చేర్చింది. అదే ఏడాది ఆమెకు ఓ యువకుడితో వివాహం జరిపించింది. అయితే వృత్తి రీత్యా భర్త విదేశాల్లో ఉంటుండటంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండేది.
ఆమెను గర్భవతిని చేసిన బాబా, ఎట్టకేలకు అరెస్ట్ :
సత్య నారాయణ్ బాబా ఆమె ఆచూకీ ఎలా తెలుసుకున్నాడో గానీ మళ్లీ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆశ్రమానికి రాకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆశ్రమానికి వెళ్లగా.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా... అబార్షన్ చేయించుకోవాలని సత్య నారాయణ్ బాబా, అతని భార్య పుష్పలత ఒత్తిడి తెచ్చారు. అయితే నానమ్మ సాయంతో ఈ ఏడాది జనవరిలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా బాబా నుంచి వేధింపులు ఆగలేదు.
ఆశ్రమానికి రావాలంటూ సత్య నారాయణ్ బాబా పదేపదే ఆమెను వేధింపులకు (Sexual Harassment) గురిచేశాడు. ఈ క్రమంలో ఆమె భర్త విదేశాల నుంచి తిరిగి రాగా... జరిగిన విషయాలన్నీ అతనికి వివరించింది. ఈ ఏడాది జనవరిలో ఆ దంపతులు సత్య నారాయణ్ బాబా, అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు గత వారం సత్య నారాయణ్ బాబా, అతని భార్య పుష్పలతను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Also Read: Hamsa Nandini: షాకింగ్ విషయం బయటపెట్టిన హంసానందిని-క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook