)
Wife calls husband as paaltu chuha in chhattisgarh: ఇటీవల కాలంలో భార్యభర్తలకు చెందిన గొడవలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. పెళ్లిళ్లు చేసుకుని కలకాలం కలిసి ఉండాల్సింది పోయి, కొంత మంది మాత్రం మరీ ఘోరంగా వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఒకర్ని మరోకరు ఎలా మర్డర్ చేసుకొవాలో ప్లాన్ లు చేసుకుంటున్నారు.
మొత్తంగా దంపతులు ఇటీవల కాలంలో అయితే హత్యలు చేయడం లేదా ఆత్మహత్యలతో వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది ప్రతి చిన్న విషయాలకు కూడా డైవర్స్ వరకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక భర్త తన భార్య రోజు తనను పాల్తూ చూహ (పెంపుడు ఎలుక) అంటు వేధిస్తుందని వాపోయాడు. ఎన్నిసార్లు చెప్పిన అందరి ముందు తనను ఎలుక అంటూ వేధించేదని చెప్పాడు. తమది జాయింట్ ఫ్యామిలీ అని, తన భార్య మాత్రం వేరుగా ఉండాలని ప్రతిరోజు గొడవలు పడుతుండటంతో చివరకు భరించలేక తొలుత పెద్దలకు చెప్పాడు.
ఇరు కుటుంబాలు దీనిపై మాట్లాడుకున్న మహిళలో మార్పు రాలేదు. ఇక భర్త కోపంతో.. ఫ్యామిలీ కోర్టు లో డైవర్స్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఫ్యామిలీ కోర్టు విడాకుల్ని మంజురు చేసింది. దీన్నిసవాల్ చేస్తు మహిళ ఛత్తీస్ గఢ్ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. అక్కడ కూడా భర్త తనపై భార్య వేధింపులు, వాట్సాప్ చాట్ లను అక్కడ కూడా చూపించాడు. అంతేకాకుండా పెళ్లైన తర్వాత కూడా భార్య సపరేట్గా ఉన్న విషయాన్ని కోర్టువారికి చెప్పాడు.
తరచుగా పెద్దలను అగౌరవపరిచేదని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి నిరాకరించిందని ఆరోపిస్తూ.. తన కుటుంబ సభ్యుల సాక్ష్యాలను కూడా అతను కోర్టుకు సమర్పించాడు. ఈక్రమంలో ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. మహిళ చేసిన పనుల్ని తప్పుపట్టింది. అదేవిధంగా.. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
విడాకులు మంజూరు చేస్తూనే భార్యకు శాశ్వత భరణంగా రూ.5 లక్షలు చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. కట్టుకున్న భర్తను పదే పదే అగౌరవపరచడం, జీవిత భాగస్వామిని కుటుంబం నుంచి వేరుచేయాలని చూడటం మొదలైన చర్యల్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘఠన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.