Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌.. 1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 25 వేల బలగాలు...

Chattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌ జరుగుతోంది. బీజాపూర్ అడవుల్లో దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 25,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుమట్టినట్లు తెలుస్తోంది. ఇక గురువారం ఉదయం వాజేడు శివారు తాళ్ల గూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. 

Written by - Renuka Godugu | Last Updated : Apr 24, 2025, 12:58 PM IST
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌.. 1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 25 వేల బలగాలు...

 Chattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌ బీజాపూర్ లో భారీగా ఆపరేషన్ జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేతకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. 1000 మంది మావోయిస్టులను 25,000 మంది భద్రత సిబ్బందితో చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. కర్రెగుట్ట కేంద్రంగా అగ్ర నేతలు మావోయిస్టులో పెద్ద సంఖ్యలో ఉన్నారని పక్క సమాచారంతో పారామీలటరీ బృందం మావోయిస్టులను చుట్టుముట్టారు. కీలక నేత హిడ్మాతోపాటు కమాండర్ స్థాయి నేతలు, అగ్ర నాయకులతో ఉన్నట్లు సమాచారం .

Add Zee News as a Preferred Source

 ఇదిలా ఉండగా గురువారం ఉదయం తాళ్ల గూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందు గుడ్ల సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కర్రే గుట్ట దండకారణ్యంలో పలు గ్రామాలకు రాపకపోకలు కూడా ఈ నేపథ్యంలో మూసివేశారు. గ్రామస్థులను బయటకు రాకూడదని ఆదేశించారు. 48 గంటలుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. మందు పాత్రలు కూడా అమర్చామని ఇప్పటికే మావోయిస్టులు లేఖ ద్వారా ప్రకటించారు. అందుకే ప్రజలను కూడా అడవిలోకి అనుమతించడం లేదు. 

 అయితే బస్తర్‌, అబూజ్ గాడి దండకారణ్యంలో హిడ్మాకు పూర్తి పట్టు ఉంది. అతన్ని టార్గెట్ చేస్తూనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. 

 ములుగు అటవీ ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలు, మావోయిస్టులు మోహరించారు. అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అటవీ ప్రాంతం చుట్టూ హెలికాప్టర్ లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హిడ్మాను లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. ఇదిలా ఉండగా రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఇదీ చదవండి: జమ్మూ కాశ్మీర్‌ బసంత్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. భారత జవాన్‌ వీరమరణం..

ఇదీ చదవండి:  గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు.. తనకు కుటుంబానికి భద్రత కల్పించాలని ఫిర్యాదు..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News