MP Chief Minister Convoy: రాష్ట్రంలో అత్యున్నద పదవి కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి. యావత్ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అతడు ప్రయాణించే వాహనాలు ఎన్నోసార్లు తనిఖీలు చేస్తుంటారు. అలాంటి వాహనాలు ఉన్నఫళంగా ఒక్కసారి ఆగిపోయాయి. వాహనాలన్నీ ఒకేసారిగా ఆగిపోవడంతో కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియక అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి భద్రతపై భయాందోళన నెలకొంది. ముఖ్యమంత్రికి ప్రాణహాని పొంచి ఉందా? అని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Weight Loss Journey: 140 కిలోల నుంచి 78 కిలోల బరువు తగ్గాడు.. అతడి సీక్రెట్ ఏమిటో చూద్దామా?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని 19 కార్లు శుక్రవారం ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. సీఎం పర్యటనకు బయల్దేరుతుండగా వాహనాలు ఆగిపోవడంతో గందరగోళం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఏం జరిగిందా? అని పరిశీలించగా విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. వాహనాల డీజిల్ ట్యాంక్‌లను తెరిచి చూడగా అందులో నీళ్లు ఉండటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. డీజిల్‌లో నీళ్లు కలపడం మధ్యప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపుతోంది.
Also Read: Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?
జరిగింది ఇదే!
మధ్యప్రదేశ్‌లోని రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గంలో బయల్దేరారు. ఈ క్రమంలోనే దోసిగావ్ అనే ప్రాంతంలో శక్తి ఫ్యూయెల్ పెట్రోల్ పంప్‌లో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలకు డీజిల్ పోయించారు. కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ డీజిల్ కొట్టించి ప్రయాణం ప్రారంభమైంది. అయితే కొంతదూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. వాహనాలు ముందుకు కదలకుండా మొరాయించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ
Water mixed in diesel found in CM convoy vehicles in Ratlam, 19 cars broke down!
◆ Backup vehicles rushed from Indore
◆ Petrol pump sealed after the incident pic.twitter.com/qbf3pmDYuq
— Desh Ka Verdict (@DeshKaVerdict) June 27, 2025
తోసుకుంటూ వెళ్లిన సిబ్బంది
రోడ్డుపై ఆగి ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలను భద్రతా సిబ్బంది తోసుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను ఇతర వాహనాల్లో పంపించారు. సీఎం కాన్వాయ్ ఆగిందనే సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు హుటాహుటినా అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. వాహనాలు ఎందుకు ఆగిపోయాయని పరిశీలించగా డీజిల్ ట్యాంకుల్లో నీళ్లు కనిపించాయి. వాహనాల్లో నింపిన డీజిల్‌ను బయటకు తీయగా సగానికి సగం అందులో నీరు కలిపినట్లు తేలింది.
కల్తీకి అడ్డాగా ఆ బంక్
ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజిల్ కల్తీ అయినట్లు గుర్తించి సంబంధిత పెట్రోల్ పంప్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా బంక్‌లో పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ బంక్ నుంచి డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఫిర్యాదులు చేయడంతో వెంటనే ఆ బంక్‌ను సీజ్ చేశారు. ఒక సీఎం కాన్వాయ్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయోనని మధ్యప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే కల్తీరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
पेट्रोल पंप मालिक ने आम और खास में भेदभाव नही किया
चाहता तो मुख्यमंत्री जी गाड़ियों में शुद्ध तेल डलवा सकता था।#Prabhas? #modiji #RathaYatra2025#Ratlam Bangladesh pic.twitter.com/aemVcpopMD
— Suraj mehra (@surajmehra01) June 27, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









