)
New Ration Cards 2025 Latest News: రేషన్ కార్డు లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి గుడ్ న్యూస్. 12 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇక నుంచి ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు లభించబోతున్నాయి. అయితే, ఈ కొత్త రేషన్ కార్డ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఢిల్లీలోని బిజెపి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. సీఎం రేఖ గుప్తా మిడిల్ క్లాస్ ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే, గతంలో 2013లో చివరిసారిగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయగా.. మళ్లీ 12 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులను నిరుపేద కుటుంబాలకు అందించబోతున్నారు.
2013 తర్వాత చాలా ప్రభుత్వలు రేషన్ కార్డులను జారీ చేస్తాయని ప్రకటించినప్పటికీ, ఏ మాత్రం మిడిల్ క్లాస్ ప్రజలను పట్టించుకోలేకపోయాయి. అయితే, బీజేపీ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లు సీఎం అధికారంగా వెల్లడించడం.. చాలా మంది ప్రజలు గుడ్న్యూస్గా భావిస్తున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది.
మీరు కూడా రాజధాని ఢిల్లీలో నివసిస్తుంటే కొత్త రేషన్ కార్డులను పొందడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్లై ప్రక్రియను కూడా ప్రారంభించారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం, ప్రస్తుతం 2.89 లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులను చేసుకున్నారని.. ఇవన్పీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని తెలిపింది. అర్హత ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ కార్డులకు అందించబోతున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఈ రేషన్ కార్డుల పంపిణికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆహార, పౌర సరఫరాల శాఖ సీనియర్ అధికారులతో సమావేశం కూడా జరిపింది. లబ్ధిదారుల సంఖ్యతో పాటు రేషన్ పంపిణీ వ్యవస్థ గురించి, పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్‌పై కూడా చర్చించారు. ఇదిలా ఉంటే ఒకవైపు కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకున్నవారిని పరిశీలించి.. కొత్త కార్డులను జారీ చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభించాలని తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఇప్పటి వరకు రేషన్ కార్డుల సంఖ్య 17.42 లక్షలు కాగా.. కొత్తగా అప్లై చేసుకున్నవారిని కలుపుకుని మొత్తం 72.50 లక్షలకు పైగా ప్రజలకు రేషన్ అందిచబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook