Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్, ఇండో పాక్ యుద్ధ పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి టార్గెట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఓ సభలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శలు గుప్పించారు. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు ట్రంప్ భయపడిపోయారని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం హఠాత్తుగా నిలిచిపోవడంపై ఇప్పటికే వివిధ రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌ను అణచివేసే అవకాశాన్ని ఇండియా చేజార్చుకుందనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పటికే ఇదే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ పలు విమర్శలు చేశారు. తాజాగా మోదీపై మరోసారి వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. నరేందర్..సరెండర్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించగానే మోదీ భయపడిపోయారని ఎద్దేవా చేశారు. ట్రంప్ భయంతోనే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని ఆరోపించారు. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఇందిరా గాంధీ ఎవరికీ భయపడలేదని, అప్పటి అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు లొంగిపోలేదని గుర్తు చేశారు. ఇండియా సత్తా ఏంటో అప్పుడే చైనా, పాకిస్తాన్ దేశాలకు ఇందిరా గాంధీ చూపించారని రాహుల్ గాంధీ అన్నారు.
అయినా సరెండర్ అవడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటేనని సెటైర్లు వేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో పాటు ఆ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులపై కూడా రాహుల్ గాధీ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఆపరేషన్ సింధూర్‌కు ముందే పాకిస్తాన్‌కు కేంద్రం సమాచారం ఇచ్చిందన్నారు. ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ దుమారం రేగుతోంది.
Also read: Wanted Criminal: నెతన్యాహూ ఓ వాంటెడ్ క్రిమినల్, దేశ రాజధానిలో వెలిసిన పోస్టర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









