)
Mp Sudha Ramakrishnan gold chain snatched in delhi: ఇటీవల కాలంలో చాలా మంది కేటుగాళ్లు జల్సాలకు అలవాడు పడి చోరీల బాటపడుతున్నారు. ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్, మహిళల్ని, ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని మరీ చైన్ లను చోరీలు చేస్తున్నారు. కొంత మంది అడ్రస్ అడిగినట్లు నటిస్తున్నారు. మరికొంత మంది తాగడానికి నీళ్లు అడిగి ఆ తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు.
ఇదంతా మనం తరచుగా చూస్తున్నాం. అయితే.. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అత్యంత భద్రత ఉన్న ప్రదేశంలో అది కూడా ఒక ఎంపీ మెడలోని చైన్ ను కేటుగాడు రెప్పపాటులో లాక్కెళ్లిపోయాడు. దీంతో మహిళా ఎంపీ షాక్ కు గురై చాలా సేపు నోట మాట లేకుండా ఉండిపోయారు.
#WATCH | "...I am still in shock. There is no safety for women in this country...I am thinking about the common women, where will they go?...A woman CM is ruling this state. Where is the safety and security? Had he slit my neck, I would have died on spot..," says Congress MP R.… pic.twitter.com/MZEZX4NQJ3
— ANI (@ANI) August 4, 2025
వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు భవన్ సమీపంలో సుధా రామకృష్ణన్ నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రోజులాగే ఎంపీ మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఇంతలో ఒక ఆగంతకుడు వాహనం మీద వారికి ఎదురుగా వచ్చాడు. ఈ క్రమంలో ఎంపీ సుధా రామకృష్ణన్ పక్కకు జరిగింది. అతను ఒక్కసారిగా ఎంపీ సుధా రామకృష్ణన్ పై దాడి చేశాడు.
ఆమె మెడలోని చైన్ ను లాక్కుని, పక్కకు బలంగా తోసేశాడు. కొంత పెనుగులాట జరిగింది. ఎంపీ మెడ మీద గాయాలయ్యాయి. ఈ హఠాత్పరిణామంతో ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే కింద పడకుండా కంట్రోల్ చేసుకున్నారు. చాలా సేపు ఎంపీ షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి బైటపడ్డారు. చాణక్యపురి ప్రాంతం అంటే అత్యంత హైసెక్యురిటీ ఉండే ప్రాంతం.
ఇక్కడ అనేక దేశాల రాయబార కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలు ఉన్నాయి. అదే విధంగా.. 24 గంటలూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి చోట కూడా ఈ చోరీ జరగడంతో ఎంపీ విస్తుపోయారు. వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనతో వీఐపీ ప్రాంతాల్లో సైతం భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.