Bharat Summit: భారత మ్యాప్‌లో కశ్మీర్‌ను లేపేసిన కాంగ్రెస్.. మరోసారి బయటపడ్డ హస్తం పార్టీ వక్రబుద్ధి..

Bharat Summit: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది. తెలిసి చేసారో.. మన దేశంలో ఉన్న కొంత మంది ఇబ్బంది పెట్టడం ఎందుకనున్నారో ఏమో వారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ లో ఏకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా భారత మ్యాప్ ను ప్రదర్శించడం వివాదాస్పదం అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 25, 2025, 05:13 PM IST
Bharat Summit: భారత మ్యాప్‌లో కశ్మీర్‌ను లేపేసిన కాంగ్రెస్.. మరోసారి బయటపడ్డ హస్తం పార్టీ వక్రబుద్ధి..

Bharat Summit: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్‌లో భారత దేశానికి ఘోర అవమానం జరిగింది.  దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో చిరకాల వైరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ.. ఎవరిని సంతృప్తి పరచాలనో ఇలా కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్ ప్రదర్శించడంపై దేశ ప్రజలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు.   అంతేకాదు ఇలాంటి నీచమైన పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ నెటిజన్స్ నుండి వ్యక్తమవుతోంది.

Add Zee News as a Preferred Source

దాదాపు ప్రపంచంలోనే 100 దేశాలకు పైగా ప్రముఖులు పాల్గొన్న  ఈ సమ్మిట్‌లో ఇలా భారత్ మ్యాప్ ను పాక్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్, లడ్డాక్ లేకుండా దేశ పటాన్ని చూపించడాన్ని  దేశ ద్రోహం కింద పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్ లోని  పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  నిర్వహించిన HICC సదస్సులో ఈ మ్యాప్ ప్రదర్శించడం అందరు తప్పుపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎపుడు దేశ వ్యతిరేక , ప్రజా వ్యతిరేఖ స్వభావాన్ని ఇది బహిర్గతం చేసిందని బీజేపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యం కాదు. కాంగ్రెస్ పార్టీ  ఖండ కావరాన్ని సూచిస్తుందన్నారు.  ఇది జాతీయ ద్రోహం. కాంగ్రెస్ పార్టీ లడఖ్, PoJKలను ఉద్దేశపూర్వకంగా మినహాయించిన మ్యాప్‌ను ప్రదర్శించిందన్నారు.  ఇది భారతదేశంలో  అంతర్భాగాలుగా కాంగ్రెస్ పార్టీ పరిగణించడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తుంన్నారు.   మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ పటాన్ని ప్రదర్శించడాన్ని భారత దేశ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష్య దాడిగా అభివర్ణిస్తున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News