కనెక్షన్స్ 2019: ఐఐఎంసీలో అల్యుమ్ని మీట్

ఢిల్లీలోని ఐఐఎంసీ ప్రాంగణంలో ఐఐఎంసిఏఏ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్ అల్యుమ్ని అసోసియేషన్ ) ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమామేశం జరిగింది

Last Updated : Feb 19, 2019, 10:12 AM IST
 కనెక్షన్స్ 2019: ఐఐఎంసీలో అల్యుమ్ని మీట్

ఢిల్లీ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్ అల్యూమినీ అసోసియేషన్ (ఐఐఎంసిఏఏ ) ఆధ్వర్యంలో అల్యుమ్ని మీట్ కనెక్షన్స్ 2019 పేరుతో సమావేశం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని ఐఐఎంసీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్) హెడ్ క్వార్టర్స్ వేదికైంది. కాగా  ప్రతి ఏడాదిలాగే ఐఐఎంసిఏఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో ప్రధాన మీడియా సంస్థల్లో స్థిరపడ్డ పూర్వవిద్యార్ధులు హాజరయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం దశల వారీగా దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో నిర్వహిస్తారు. అటూ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమంం నిర్వహించడం జరుగుతుంది. ఈ భేటీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 నగరాల్లో వేర్వేరు సమావేశాలు జరగనున్నాయి.  2 నెలల వ్యవధిలో అల్యూమినీ మీట్ ముంబై, భువనేశ్వేర్ , లక్నో, పాట్నా, చండీగఢ్, భోపాల్, రాయ్ పూర్, కోల్ కతా, జైపూర్, అహ్మదాబాద్, సింగ్ పూర్ మరియు ఢాకా లో జరగుతాయి

ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిజం, డిజిటల్, అడ్వర్టైజింగ్, ప్రజా సంబంధాలు, బ్రాండింగ్ వంటి రంగాల్లో కొనసాగుతున్న 35 మంది మాస్ కమ్యునికేషన్ రంగ నిపుణులకు ఇఫ్కో ఇమ్కా అవార్డ్స్ 2019 (IFFCO IIMCAA Awards 2019) అవార్డ్స్ అందజేయనున్నారు. ఈ సమావేశాల్లోనే జ్యూరి ఎంపికలు జరగనున్నాయి. 
 

Trending News