Consumer Forum Penalty: నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తే వినియోగదారుల కోర్టులు భారీ జరిమానా విధిస్తుంటాయి. వినియోగదారులు తక్కువ ధర అని ఊరుకోవడం సరికాదు వినియోగదారులకు బాధ్యతాయుతంగా విక్రయదారులు ఉండాల్సి ఉంది. బాధ్యత విస్మరించిన వారికి కన్య్సుమర్ కోర్టులు భారీ షాక్‌లు ఇస్తుంటాయి. అలాగే ఓ వినియోగదారుడు నిర్ణీత ధర కన్నా ఎక్కువ వసూలు చేసినందుకు కోర్టులో ఫిర్యాదు చేయగా కన్య్సుమర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రూ.27 అధికంగా వసూలు చేసినందుకు రూ.27 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: New Posts For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం
ఏపీలోని కాకినాడకు చెందిన కుసుమ కల్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ ట్యూలిప్స్ గ్రాండ్ హోటల్‌లో మూడు వాటర్ బాటిల్స్ కొన్నారు. వాటికి అదనంగా హోటల్ సిబ్బంది రూ.27 వసూలు చేసింది. ఇదేమిటని ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యం చేసింది. కల్యాణ్ అంతటితో ఊరుకోకుండా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. అన్యాయమని హోటల్ యజమాన్యాన్ని అడిగినా స్పందన లేకపోవడంతో ఫోరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అతడి ఫిర్యాదుపై హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం నోటీసులు పంపించింది. అయితే వాటికి కూడా హోటల్ యాజమాన్యం స్పందించలేదు.
Also Read: Basic Pay Scale: కనీస వేతనం కోసం ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం
హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు వినియోగదారుడితో అధికంగా వసూలు చేస్తున్న కారణంగా ఆ హోటల్‌పై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుల ఫోరం రూ.27,27000 భారీ జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.27 అదనంగా డబ్బులు వసూలు చేసినందుకు గాను జరిమానాగా రూ.25 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని.. రూ.25,000 వినియోగదారుడికి.. రూ.2000 న్యాయస్థానానికి చెల్లించాలని హోటల్ యజమాన్యానికి ఫోరం ఆదేశించింది.
ఈ కేసు పై తీర్పు ఇచ్చిన వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షుడు రఘుపతి, సభ్యులు సుశి కీలక విషయాలు వెల్లడించారు. 'హోటల్ హైదరాబాద్‌లో ఉన్నా వినియోగదారుడు కాకినాడకు చెందిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా కేసు వేయవచ్చని కాకినాడ ఫోరమ్‌లో కేసు వేశాడు' అని తెలిపారు. 'వినియోగదారుడు నిత్యం దోపిడీకి గురవుతుంటాడు. తక్కువ డబ్బులే అని వదిలేయకూడు' అని వినియోగదారులకు సూచించారు. ప్రజలు వినియోగదారుల ఫోరాన్ని సద్వినియోగం చేసుకుని అధిక ధరలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









