Edible Oil Imports In India: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చమురు కొనుగోళ్లను పెంచనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు లోనవుతున్న చమురు ధరలు ఇప్పుడు భారీగా తగ్గుదలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేట్లు తగ్గుదల కారణంగా దేశీయ ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది.
2024-25 ఏడాదిలో భారతదేశ వ్యాప్తంగా 16 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకున్నారు. ఇది గత ఏడాది దిగుమతి చేసుకున్న 15.96 మిలియన్ టన్నుల కంటే కొంచెం ఎక్కువ. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) ప్రకారం.. పెరిగిన దిగుమతులు దేశీయ మార్కెట్ సరఫరాను బలోపేతం చేయడమే కాకుండా..వంట నూనెల ధర తగ్గుదల సంకేతాలను సూచిస్తుంది.
మార్కెట్ విలువ పరంగా నూనెల దిగుమతులు 2023-24లో రూ.1.32 లక్షల కోట్ల నుండి 2024-25లో రూ.1.61 లక్షల కోట్లకు పెరిగినట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు పెరిగినప్పటికీ, సరఫరా పెరగడం వల్ల దేశీయ ధరలు తగ్గాయి. ఆర్థికవేత్తల ప్రకారం.. అధిక వంట నూనెల నిల్వలు కారణంగా రాబోయే రోజుల్లో ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
ఇండోనేషియా, మలేషియా, అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి పామాయిల్, సోయాబీన్ నూనెను భారత్ దిగుమతి చేసుకుంటోంది. గత 20 ఏళ్లలో వంటనూనె దిగుమతులు 2.2 రెట్లు పెరగ్గా.. వాటి విలువ 15 రెట్లు భారీగా పెరిగింది.
ఈ ఏడాది సోయాబీన్ వంట నూనె దిగుమతులు రికార్డు స్థాయిలో 5.47 మిలియన్ టన్నులకు చేరుకోగా.. పామాయిల్ దిగుమతులు మాత్రమే ఈ ఏడాది 7.58 మిలియన్ టన్నులకు తగ్గుదలకు చేరుకున్నాయి. శుద్ధి చేసిన నూనె దిగుమతులు కూడా తగ్గాయి. దీనివల్ల మార్కెట్ పామాయిల్ పై ఆధారపడటం తగ్గిందని SEA స్పష్టం చేసింది.
మొత్తం మీద.. భారతదేశంలో వంట నూనెల సరఫరా తగినంతగా ఉన్న నేపథ్యంలో ధరలలో స్థిరమైన తగ్గుదల వినియోగదారులకు పెద్ద సహాయంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, పెరిగిన సరఫరా, ప్రభుత్వ విధానాలు రాబోయే నెలల్లో చమురు ధరలను మరింత నియంత్రిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









