CoronaVirus Positive Cases: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. గత నెల నుంచి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగొస్తున్నాయి. కోవిడ్19 మరణాలు మాత్రం నిలకడగా నమోదు కావడం కాస్త ఆందోళనను కలిగిస్తోంది. మరోవైపు కరోనా రికవరీ రేటు మెరుగవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80,834 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో వరుసగా ఆరోరోజూ లక్ష దిగువన కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. గత 71 రోజులలో భారత్‌లో నమోదైన అతి తక్కువ కోవిడ్19 కేసులు ఇవే. తాజాగా నమోదైన కేసులతో కలిపితే ఇండియాలో ఇప్పటివరకూ కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడిన వారి సంఖ్య 2,94,39,989 (2 కోట్ల 94 లక్షల 39 వేల 989)కు చేరింది. శనివారం ఒక్కరోజు 3,303 కోవిడ్19 మరణాలు సంభవించాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 3,70,384 (3 లక్షల 70 వేల 384) మంది ప్రాణాలు కోల్పోయారు.


Also Read: Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్



శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో 1,32,062 (1 లక్షా 32 వేల 62) మంది చికిత్స అనంతరం కోవిడ్-19 (COVID-19) బారి నుంచి కోలుకున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ మొత్తం 2,80,43,446 (2 కోట్ల 80 లక్షల 43 వేల 446) మంది కరోనాను జయించారు. దేశంలో యాక్టివ్ కేసులు మిలియన్‌కు దిగొచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,26,159 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇండియాలో ఇప్పటివరకూ 25 కోట్ల 31 లక్షల 95 వేల 48 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు.


Also Read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన


రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.25 శాతానికి తగ్గింది. మరోవైపు ఇండియాలో కరోనా రికవరీ రేటు 95.26 శాతానికి చేరుకుంది. గత నెల రోజులుగా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులకన్నా డిశ్ఛార్జ్‌లు అధికంగా ఉండటం భారీ ఊరట కలిగిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook