Coronavirus Variants: కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమవుతున్న వేరియంట్లు ఇవేనా..కారణాలేంటి
Coronavirus Variants: కరోనా సెకండ్ వేవ్ విలయం నుంచి కోలుకోకముందే కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొచ్చే ప్రమాద హెచ్చరికలు విన్పిస్తున్నాయి. దేశంలో కన్పిస్తున్న వివిధ వేరియంట్లు కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమవుతాయా అనే అనుమానాలు తలెత్తతున్నాయి. అసలు థర్డ్‌వేవ్‌కు కారణమేంటి..
Coronavirus Variants: కరోనా సెకండ్ వేవ్ విలయం నుంచి కోలుకోకముందే కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొచ్చే ప్రమాద హెచ్చరికలు విన్పిస్తున్నాయి. దేశంలో కన్పిస్తున్న వివిధ వేరియంట్లు కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమవుతాయా అనే అనుమానాలు తలెత్తతున్నాయి. అసలు థర్డ్‌వేవ్‌కు కారణమేంటి..
కరోనా మహమ్మారి సృష్టించిన సెకండ్ వేవ్ (Corona Second Wave) సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు దేశంలో కరనా థర్డ్‌వేవ్ భయం వెంటాడుతోంది. అసలు కరోనా థర్డ్‌వేవ్‌కు దారి తీస్తున్న పరిస్థితులేంటనేది పరిశీలిద్దాం. 2020 లో కరోనా ఉపద్రవం ప్రారంభమైనప్పటి నుంచి మాస్క్ ధరించడం, శానిటైజ్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటివి జీవితంలో భాగమైపోయాయి. అయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన వెంటనే కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తుంగలో తొక్కి..మరోసారి కరోనా వైరస్(Coronavirus)సంక్రమణకు కారణమవుతున్నాం. వ్యాక్సినేషన్ పట్ల అనాసక్తి చూపించడం లేదా వ్యాక్సిన్ వేసుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండటం వంటివి స్పష్టంగా కన్పిస్తున్నాయి. అందుకే దేశంలో వివిధ రకాల వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి.
ప్రపంచదేశాల్ని ఇప్పటికే ల్యాంబ్డా వేరియంట్(Lambda Variant) భయపెడుతోంది. ఈ వేరియంట్ కరోనా థర్డ్‌వేవ్(Corona Third wave) కు కారణమవుతుందనే భయం నెలకొంది. ఈ వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే 30 దేశాల్లో ఈ వేరియంట్ వెలుగు చూసింది. కెనడాలో 27 కేసుల్ని గుర్తించారు. మరోవైపు కోవిడ్ 19 కప్పా వేరియంట్(Kappa variant) జాడలు దేశంలో కన్పిస్తున్నాయి. తక్కువ తీవ్రత ఉండే ఈ వేరియంట్ లక్షణాలన్నీ డెల్టా వేరియంట్‌లానే ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో 2 కేసులు వెలుగు చూశాయి.
Also read: Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధత, ప్రధాని మోదీ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి