)
Cough Syrup Deaths: దగ్గుమందు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే ఆ మందు రాసిచ్చిన వైద్యుడు కూడా దాన్ని తాగి ఆస్పత్రి పాలైన ఘటన రాజస్థాన్‌లోని బయానా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. సెప్టెంబర్ 24 తేదీన మూడేళ్ల చిన్నారి విపరీతమైన దగ్గు కారణంగా తన తల్లిదండ్రులు దగ్గర్లోని డాక్టర్ తారాచంద్ యోగి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ వైద్యుడు దగ్గుమందు రాసి ఇచ్చాడు.
ఆ మందు తాగిన బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెంటనే తల్లిదండ్రులు ఆ వైద్యుడ్ని నిలదీశారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటారా అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఆ తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు ఆ వైద్యుడు కూడా ఆ దగ్గు మందుని తాగాడు. ఆ తర్వాత కారులో తన ఇంటికి వెళ్లే క్రమంలో అతను స్పృహ కోల్పోయాడు.
అయితే అప్పటికే ఈ దగ్గు మందు ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా చిరానాకు చెందిన నితీశ్ (5) అనే బాలుడికి దగ్గర్లోని బయానా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గు ఎక్కువగా ఉందని వైద్యుడు ఓ సిరప్ రాసిచ్చాడు. రాత్రికి అదే మందు తాగిన బాలుడు, ఉదయాన్నే నిద్ర లేవలేదు. భయంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు.
అదే ప్రాంతంలో ఆ సిరప్ తాగిన మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మల్లా ప్రాంతానికి చెందిన సామ్రాట్ జాదవ్ (2) అనే చిన్నారి కూడా అదే కంపెనీకి చెందిన దగ్గు మందు తాగి మరణించినట్లు సమాచారం. జ్యోతి అనే మహిళ తన ముగ్గురు చిన్నారులకు ఇదే సిరప్ ఇవ్వగా.. వారంతా తాగిన తర్వాత స్పృహ కోల్పాయరు. ఆ ఇద్దరు చిన్నారులు విపరీతమైన వాంతులతో ప్రాణాపాయం నుంచి బయటపడినా.. మూడో పిల్లాడు సామ్రాట్ మృతి చెందాడు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఇలా ఇలాంటి ఘటనలు నమోదవుతున్న క్రమంలో రాజస్థాన్ ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. కేసన్ అనే కంపెనీ సరఫరా చేసిన 22 బ్యాచ్‌ల దగ్గు మందును వెంటనే నిషేధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ఆయా సిరప్‌లను పూర్తిగా నిలిపేస్తున్నట్లు అదేశాలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook