Covid Cases: దేశంలో మరోసారి కరోనా డెంజర్ బెల్స్.. 4000ల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు.. ఠారెత్తిస్తున్న మరణాల సంఖ్య..

Corona virus: దేశంలో కరోనా కేసులు మరోసారి చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 3, 2025, 12:10 PM IST
  • దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా..
  • ఆందోళనలో ప్రజలు..
Covid Cases: దేశంలో మరోసారి కరోనా డెంజర్ బెల్స్..  4000ల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు.. ఠారెత్తిస్తున్న మరణాల సంఖ్య..

covid 19 cases in india rise to above 4000 mark: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. కరోనా యాక్టివ్ కేసుల మార్క్‌ 4 వేలను దాటింది. ఈ క్రమంలో ప్రస్తుతం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకాం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ కొత్తగా 72 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Add Zee News as a Preferred Source

అదే విధంగా.. 24 గంటల్లో ఐదుగురు మరణించారు. జూన్‌ 3 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,026కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,416 కేసులు నమోదయ్యాయి.  ఢిల్లీలో 393, పశ్చిమబెంగాల్‌లో 372, కర్ణాటకలో 311, మహారాష్ట్రలో 494, గుజరాత్‌లో 397 కేసులు నమోదయ్యాయి.

అదే విధంగా గడిచిన.. కోవిడ్ బారిన పడి.. ఐదుగురు చనిపోయారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 37కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Read more: Tirumala Darshanam Time: తిరుమలలో పోటెత్తుతున్న భక్తులు, దర్శనానికి ఎంత సమయం పడుతోంది

ఆంధ్రప్రదేశ్ 28, తెలంగాణలో నాలుగు కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ.. దేశంలో కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రతిరోజు కోవిడ్ టెస్టుల సంఖ్య వెయ్యికి పెంచాలని సూచించింది. కోవిడ్ పెషెంట్ల కోసం ప్రత్యేకంగా వార్డుల్ని కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News