Covid 19 Alert: వేగంగా సంక్రమిస్తున్న కరోనా మహమ్మారి, ఎంతమంది మరణించారంటే

Covid 19 Alert: కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతంగా వ్యాపిస్తోంది. కోవిడ్ యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి ఇప్పటి వరకు ఏకంగా 32 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2025, 10:25 PM IST
Covid 19 Alert: వేగంగా సంక్రమిస్తున్న కరోనా మహమ్మారి, ఎంతమంది మరణించారంటే

Covid 19 Alert: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. కోవిడ్ 19 ఈ ఏడాది ఆరంభం నుంచి ఎక్కువగా ఉంది. మే నెలాఖరు నుంచి కోవిడ్ వ్యాప్తి మరింత తీవ్రమైందని రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రత్యేకించి కేరళ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తేలింది. 

Add Zee News as a Preferred Source

కరోనా వైరస్ యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల గత వారం రోజులుగా తీవ్రత పెరిగింది. ఇప్పటి వరకు అంటే జనవరి నుంచి లెక్కేస్తే కోవిడ్ కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తత జారీ చేశాయి. దేశంలో ఇప్పటి వరకు 3,921 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. కేరళలో అత్యధికంగా 1435 కోవిడ్ కేసులు నమోదు కాగా 24 గంటల వ్యవధిలో 360 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత అత్యధికంగా మహారాష్ట్రలో 560, డిల్లీలో 483, పశ్చిమ బెంగాల్‌లో 339, గుజరాత్‌లో 338, తమిళనాడులో 199, యూపీలో 149, ఒడిశాలో 12, పంజాబ్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ కారణంగా 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కోవిడ్ వైరస్ సోకినవారిలో ఇప్పటి వరకు 2,188 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వైద్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

Also read: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ వర్షం రద్దయితే ఎవరికి లాభం, విజేత ఎవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News