CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?
Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
CSIR asks staff to wear non ironed clothes every monday as a part of wrinkles acche hai: మనలో చాలా మంది ఆఫీసులకు నీట్ గా దుస్తులను ఐరన్ చేసుకుని వెళ్తుంటారు. అందరికన్న తామే స్పెషల్ గా ఉండాలని భావిస్తారు. చాలా మంది తమ డ్రెస్ నీట్ గా ఉంటే చూడటానికి పోలైట్ గా ఉంటారు. అదే ముడతలు పడి, మురికిగా ఉంటే చూడటానికి అంతగా ఇంప్రెషన్ ఉండదు. అందుకే చాలా మంది బట్టలపై స్పెషల్ గా కాన్సట్రేషన్ చేస్తుంటారు. ఇక మిగతా వారాలకన్న కూడా సోమవారం నాడు చాలా స్పెషల్గా భావిస్తారు. ఈరోజున ప్రతి ఒక్కరు నీట్ గా రెడీ అయి ఆఫీసులకు వెళ్తుంటారు. అంతేకాకుండా.. సోమవారం రోజున ప్రైవేటు కంపెనీలలో క్లైంట్ లలో మీటింగ్ లు, ఆఫీసులలో కొలిగ్స్ తో మీటింగ్ లు మొదలైనవి ఉంటాయి. అందుకే ఆరోజున ఇంకాస్తా స్పెషల్ గా కన్పించేలా ప్లాన్ లు చేసుకుంటారు. ఈ క్రమంలో సీఎస్ఐఆర్ సంస్థ వినూత్న ప్రచారం ప్రారంభించింది.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ.. తమ సిబ్బందిని ప్రతి సోమవారం రోజు ముడతలు పడిన దుస్తులువేసుకుని ఆఫీసులకు రావాలని సూచించింది. సీఎస్ఐఆర్ తొలి మహిళ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కళైసెల్వి ..వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం గురించి అవగాహాన కల్పించారు. మనం ప్రతిరోజు ఐరన్ ఒక జత దుస్తులు చేసుకొవడం వల్ల.. 200 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలు అవుతుందని తెలిపారు.ఈవిధంగా క్రమంలో మనం ఉద్గారాలు తగ్గించేదుకు ఇలా ఒకరోజు కేటాయించాలని అన్నారు.
ప్రతిఒక్కరు ఇదే విధనం ఫాలో అయితే..క్రమంలో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావంను గాలిలో తగ్గించవచ్చని ఆమె తెలిపారు. ఇప్పటికే సీఎస్ఐఆర్ మే 1 నుంచి 15 వరకు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వాతావరణంలో చెడు ఉద్గారాల ప్రభావం,పర్యావరణ మార్పులను నియంత్రించడానికి ఈ విధంగా వినూత్న కార్యక్రమం ప్రారంభించినట్లు సీఎస్ఐఆర్ వెల్లడించింది. ప్రస్తుతం రోజురోజుకు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి, ఫార్మాకంపెనీల నుంచి కలుషితాలు వెలువడి వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుంది.
Read MOre: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
దీని వల్ల సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా భూమిమీద పడుతున్నాయి. అతినీల లోహిత కిరణాలప్రభావం వల్ల విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. అప్పుడే ఎండలు, ఆ తర్వాత వర్ఫాలు ఇలా భిన్నమైన వాతావరణం వల్ల..భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని నిపుణులు ఇప్పటి హెచ్చరిస్తున్నారు. చెట్లను పెంచాలని, గ్రీనరీని కాపాడుకోవాలని కూడా సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter