Commercial Tax Notice: పని చేస్తే కానీ పూట గడవదు. రెక్కాడితే కానీ డొక్కాడదు. రోజు పనికి వెళ్తేనే కడుపులో ముద్ద పడుతుంది. అలాంటి వ్యక్తికి ఏకంగా రూ.22 లక్షల జీఎస్టీ చెల్లించాలని అధికారులు నోటీసులు పంపించారు. ఆ నోటీసుల్లో ఏముందో కూడా తెలుసుకోని వ్యక్తికి వేరొకరు చెబితే తెలిసింది. అధికారులు పంపిన నోటీసులు చూసి అతడు విస్తుపోయాడు. ఇదేంది అంటూ లబోదిబోమంటున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ అనేది తెలుసుకోండి.
Also Read: Telangana Congress: మీనాక్షి 'ఆపరేషన్' మొదలైందా..? రేవంత్ రెడ్డికి చెక్ పడిందా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కృష్ణా జిల్లా చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు నిరుపేద. రోజూ కూలీ పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. సొంత ఇల్లు కూడా లేని ఆ వ్యక్తి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడని.. వడ్డీ ఎగ్గొట్టాడని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపారు. 'కోటి రూపాయల వ్యాపారం చేశావు. దానికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదు. జీఎస్టీతోపాటు వడ్డీ కలిపి మొత్తం రూ.22 లక్షలకు పైగా పన్ను చెల్లించాల్సి ఉంది. వెంటనే చెల్లించాలి' అంటూ విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు.
Also Read: Jagadish Reddy: తెలంగాణ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెండ్
ఈ నోటీసులకు కూలీ వెంకటేశ్వర్లు షాక్‌కు గురయ్యాడు. సరైన ఇల్లే లేని వెంకటేశ్వర్లకు తన పేరుతో విజయవాడ కేంద్రంగా భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ అనే పేరుతో 2022లో గ్రానైట్ వ్యాపారం ఉందని నోటీసుల్లో ఉంది. ఆ కంపెనీ పేరుతో ఒకే రోజు కోటి రూపాయల వ్యాపారం చేసి వాటికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదంటూ విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు కూడా చదవడం రాని వెంకటేశ్వర్లు తెలిసిన అధికారులతో చదివించుకున్నాడు.
తన పేరుతో నోటీసులు రావడం ఏంటని తెలిసిన వారిని తీసుకుని విజయవాడ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లితే దిమ్మదిరిగే నిజాలు తెలిశాయి. వెంకటేశ్వర్లు పేరుపై పాన్ కార్డు, ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్లు తీసుకుని ఆ కంపెనీ పేరు నమోదు చేయించుకున్నారు. తన డాక్యుమెంట్లతో ఎవరో మోసం చేసినట్లు వెంకటేశ్వర్లకు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. తనకు న్యాయం చేయాలని వెంకటేశ్వర్లు పోలీసులను ఆశ్రయించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









