2% DA Hike To Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్) భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం దక్కనుంది. డీఏ పెంపుతో కనీస వేతనంలో భారీగా పెరుగుదల రానుంది. అయితే ఈ పెంపు ఎక్కడ? ఎంత పెంచారు? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం రెండు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపును ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వేలాది మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. కరువు భత్యం పెంచుతూ జూన్ 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన రేటు జనవరి 1, 2025 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. డీఏ అనేది ప్రాథమిక వేతనంలో భాగమనే విషయం తెలిసిందే.
Also Read: Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా.. రెండు డీఏల విడుదలకు నిర్ణయం
జూన్ 4వ తేదీన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వు ప్రకారం 'జనవరి 2025 నుంచి మే 2025 వరకు అమల్లోకి వచ్చే అదనపు వాయిదా. డియర్‌నెస్ భత్యం కారణంగా బకాయిలు జూన్ 2025లో నగదు రూపంలో చెల్లిస్తారు. జూన్ 2025 నుండి నెలవారీ పెన్షన్/కుటుంబ పెన్షన్‌లో భాగంగా ఉంటాయి' అని వెల్లడించింది. పెంచిన డీఏ జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. జనవరి నుండి మే 2025 వరకు పెరిగిన డీఏ బకాయిలను జూన్ 2025లో నగదు రూపంలో చెల్లిస్తారు.
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం 2025 జనవరి నుంచి మే నెలల బకాయిలను జూన్ 2025లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జూన్ 4, 2025న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో డీఏ మంజూరుకు సంబంధించిన అన్ని ఇతర నిబంధనలు ఇలా ఉన్నాయి. తిరిగి ఉద్యోగంలో చేరిన లేదా బహుళ పెన్షన్లు పొందుతున్న పెన్షనర్లకు సంబంధించిన నియమాలు సహా ఈ కొత్త ఆర్డర్ నిబంధనలకు విరుద్ధంగా లేనంత వరకు మారవు అని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదలకు అనుగుణంగా డీఏను సర్దుబాటు చేయడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీవ్ర ఆలోచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉన్నా కూడా ఉద్యోగుల క్షేమం కోరి జమ్మూ ప్రభుత్వం డీఏ పెంపునకు నిర్ణయం తీసుకోవడం విశేషం.
Also Read: Govt Employees: షాకింగ్.. ఒక్క డీఏకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంబరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









