100 Flights Delay Due To ATC Technical Issue: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపంతో 100 విమానాల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏటీసీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి సమస్యల వల్ల ఈ జాప్యం జరుగుతోంది. పలు విమానాలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే విమానాశ్రయ బృందంతోపాటు DIAL కూడా సమస్య పరిష్కారానికి పని చేస్తున్నాయి. ఇక ప్రయాణీకులకు కలిగిన ఈ అసౌకర్యానికి ఢిల్లీ ఇందిరాగాంధి విమానాశ్రయ యాజమాన్యం విచారం కూడా వ్యక్తం చేసింది. రీషెడ్యూల్ చేసిన విమాన ప్రయాణానికి సంబంధించిన ఆయా విమానాయన సంస్థలను వెంటనే సంప్రదించాలని కూడా కోరింది.
అయితే, ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆటోమెటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లో ఈ సాంకేతిక సమస్య ఏర్పడినట్లు సమాచారం. ఇప్పటికే వరుస విమానా ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న విమాన ప్రయాణీకులకు ఇది మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికీ విమానం ప్రయాణం అంటేనే వారు భయపడుతూనే ప్రయాణం చేస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక విమానంలో సాంకేతిక లోపం వంటి వార్తలు కూడా వింటున్నాం. మొన్న అమెరికాలోని కెంటకీలోని లూయిస్‌విల్లేలో కూడా కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బ్లాస్ట్ అయింది.
Flight operations at Delhi Airport are experiencing delays due to a technical issue in the Automatic Message Switching System (AMSS), which supports Air Traffic Control data. Controllers are processing flight plans manually, leading to some delays. Technical teams are working to…
— Airports Authority of India (@AAI_Official) November 7, 2025
సంబంధిత విమాన సంస్థలు కూడా తమ ప్రయాణీకులకు తాజా విమాన ప్రయాణ షెడ్యూల్‌తో మెసేజ్‌లు కూడా పంపిస్తున్నాయి. ఈ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సంబంధంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ సాంకేతిక లోపం కారణంగా అక్కడి విమాన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. వెంటనే ఫ్లైట్స్ కూడా రీషెడ్యూల్ చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విమాన ప్రయాణీకులు కూడా వాపోతున్నారు.
Read more: ఎయిర్‌టెల్ యూజర్‌ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. 5జీ స్పీడ్‌తో అల్టిమేట్ చీపెస్ట్ ప్యాక్..!
Read more: పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్.. 21వ విడుత నిధులు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









