Delhi Blast several dead in explosion near Red Fort Metro Station: దేశ రాజధానిలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుంది. ఎర్రకోట మెట్రో రైలు స్టేషన్ సమీపంలో ఒక కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా ఎనిమిది వరకు కార్లు ధ్వంసమైయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారిపోయింది. భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. లాల్ ఖిలా ఎర్రకోట గేట్ నంబర్ 1 వద్ద పేలుడు సంభవించింది. ఫైర్ అధికారులు భారీగా చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రిలకు తరలించారు. వెంటనే అన్ని విభాగాల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. విచారణ ప్రారంభించారు.
BREAKING: Explosion near Red Fort area in Old Delhi. Explosion near metro station.
Blasts on a day when there has been a major crackdown on terror modules plotting a strike on Delhi.Details awaited. pic.twitter.com/tELxBP9bBh
— Rahul Shivshankar (@RShivshankar) November 10, 2025
గేట్ నెంబర్-1 సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం 6.45 నిమిషాలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే గుజరాత్, హైదరాబాద్ లో పలువురు ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ ను టార్గెట్ చేసుకొవడం సాయంకాలంలో పేలుడు సంభవించడం వెనుక భారీ ఉగ్రకుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. కారులో భారీగా పేలుడు పదార్థాలు తీసుకొని వచ్చి మరీ ముందుగా ఎంచుకున్న విధంగా రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలుడును జరిపిఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కారులో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి రిమోట్ తో ఏమైన పేలుడు చేశారా..?.. అన్న కోణంలో కూడా అధికారులు విచారణ ప్రారంభించారు.
పోలీసులు జాగీలాలను అక్కడకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలో సోమవారం హలీడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట వద్ద ప్రజల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది. అదే ఇతర రోజులలో అయితే..పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని కూడా స్థానికులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









