Delhi Blast: పహల్గామ్ ఉగ్రదాడి ఎవరూ మరకముందే ఇప్పుడు మరో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మరణించారు. మరో 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల భారత సెక్యూరిటీ ఏజెన్సీలకు నివేదించిన నివేదికల ప్రకారం, పాకిస్టాన్ నేపథ్యంతో పని చేస్తున్నట్టు గుర్తించిన ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్ అనే హ్యాకర్ గ్రూప్ భారత్ ప్రభుత్వ, సైనిక నెట్‌వర్క్‌లపై లక్ష్యంగా విధ్వంసక చర్యలు చేపట్టినట్లు ప్రతి స్థాయిలోనూ గుర్తించింది. ఈ గ్రూప్ ఛాయలో పనిచేస్తున్న సైబర్ సెల్స్ తమ మెథడ్స్‌ను మారుస్తూ, పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లను వదిలి ప్రైవేట్ సర్వర్లను ఉపయోగించడం ప్రారంభించారని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఫీడ్‌లో చెప్పిందే.. ఈ మాల్‌వేర్ బాస్ లినక్స్ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ఉపయోగించే సిస్టమ్‌లను టార్గెట్ చేస్తూ, డెస్క్‌రాట్ స్పైవేర్ తరహాలో హానికరమైన క్రియాశీలత ప్రదర్శిస్తోందని.. ఒకసారి ఇన్స్టాల్ అయితే, ఫైళ్లను స్క్యాన్ చేసి, సెన్సిటివ్ డేటాను సేకరించి బయటకు పంపించే సామర్థ్యం కలిగి ఉన్నట్టు తెలిపింది. లడఖ్ సరిహద్దు ఉద్రిక్తతలను ఉపయోగించి చైనా సైనిక కదలికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ను భారత సిస్టమ్స్ ద్వారా దొంగలించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.
ఏజెన్సీలు తెలిపిన సమాచారం ప్రకారం.. హ్యాకర్లు ప్రభుత్వ నోటీసులు, జిప్ ఫైళ్లు, ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్ రూపంలో కనిపించే ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. అధికారులు వాటిని ఓపెన్ చేయగానే ఫైళ్లు డౌన్ లోడ్ అవుతున్నాయి. ఇన్ స్టాల్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆఫీసుల్లో విస్త్రుతంగా ఉపయోగించే బాస్ లినక్స్ సిస్టమ్స్ కు అనుకూలంగా రూపొందించిన డెస్క్ రాట్ స్పైవేర్ గోప్యంగా ఫైళ్లను పర్యవేక్షించి, సేకరించి, ఉగ్రవాదులకు డేటా పంపుతుంది. ఈ తాజా దాడులు మరింత గోప్యంగా జరుగుతున్నాయి.
హ్యాకర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సాయంతో వేగంగా కొత్త మాల్వేర్ రూపాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు ఈ వేగానికి సాధారణ సైబర్ భద్రతా రక్షణలు తట్టుకోలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వైట్ కాలర్ నెట్ వర్క్ ను అధికారులు ఛేదించిన సంగతి తెలిసిందే. ఉగ్రచర్యలతో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లతోపాటు మరికొందరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. యూపీ, హర్యానా, జమ్మూకశ్మీర్ లో దాడులు నిర్వహించి 2,500 కిలోలకు పైగా పదార్థాలు, రైఫిల్స్, పిస్టల్స్, ఇతర అనుమానాస్పద వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
మొన్న హ్యాకింగ్, నిన్న స్లీపర్ సెల్స్ అరెస్ట్..నేడు ఢిల్లీలో పేలుడు.. ఇదంతా ఉగ్రవాదుల కుట్రనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో హైఅలర్ట్ విధించారు. అపరేషన్ సిందూర్ ను ఎవరూ మరవకముందే ఇలాంటి పేలుడు సంభవించడం గమనార్హమని చెప్పాలి. ఉగ్రవాద చర్యగా తేలితే భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది.
Also Read: Delhi Blast : ఢిల్లీని కుదిపేసిన భారీ పేలుళ్లు.. 8 మంది మృతి.. కలచివేస్తున్న ఫోటోలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









