Arvind Kejriwal daughter Wedding Video: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కూతురు పెళ్లి ఇటీవల కపుర్తాల హౌస్ లో జరిగింది. ఈవేడుకకు దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రీటీలు పాల్గొన్నారు. అదే విధంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం కుటుంబంతో సహా పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత, సంభవ్ ల పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది.
Arvind Kejriwal Sahab showing his dance moves at his daughter’s wedding!#ArvindKejriwal
pic.twitter.com/0T8i5XyruR— Choudhary Danish Azaam (@danishazaam012) April 18, 2025
హర్షిత, సంభవ్ లు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. వీళ్లిద్దరు కూడా కలిసి ఢిల్లీ ఐఐటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఒకేచోట కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. అప్పుడు వీరి మధ్య అనూహ్యంగా ఒకరంటే మరోకరికి ఇష్టం కల్గింది. దీంతో ప్రేమించి పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈ పెళ్లిలో ముఖ్యంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. పుష్ప2 సినిమాలోని సాంగ్స్ ఎంత ఫెమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ముఖ్యంగా సూసేకీ పాట మాత్రం ఒక రేంజ్ లో హిట్ అయ్యింది.
Arvind Kejriwal Sahab showing his dance moves at his daughter’s wedding!#ArvindKejriwal
pic.twitter.com/0T8i5XyruR— Choudhary Danish Azaam (@danishazaam012) April 18, 2025
ఎక్కడ చూసిన కూడా ఇదే పాటకు ఏజ్ తో సంబంధం లేకుండా ఇప్పటికి డ్యాన్స్ లు చేస్తు వీడియోలు , రీల్స్ చేస్తునే ఉంటారు.ఈ క్రమంలో తాజాగా.. సీఎం సతీమణి సునీత కూడా పుష్ప2 సుసేకీ సాంగ్ కు అదిరిపోయే విధంగా స్టెప్పులు వేశారు.
మరోవైపు సీఎం భగవంత్ మాన్ సైతం ఈ పెళ్లిలో డ్యాన్స్ లు చేస్తు రచ్చ చేశారు. వీళ్ల డ్యాన్సులకు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా.. కొత్త జంట ఇప్పటికే బసిల్ హెల్త్ పేరుతో స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారు.









