Delhi high Court Judge: జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వివాదం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు..

Justice Yashwanth Varma: ఢిల్లీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై తాజాగా.. ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 24, 2025, 01:51 PM IST
  • జడ్జీ ఘటనలో కీలక పరిణామం..
  • న్యాయ విధుల నుంచి దూరంగా ఉండాలని ఉత్తర్వులు..
Delhi high Court Judge: జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వివాదం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు..

Cash found in hc judge yashwanth varma: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఇటీవల భారీగా డబ్బుల కట్టలు లభ్యమయ్యాయి. హోలీ నేపథ్యంలో జస్టిస్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇంట్లో ఉన్నవాళ్లు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్ని మాపక సిబ్బంది.. గదిలో భారీగా నోట్ల కట్టల్ని గుర్తించారు . దీనిపై ఆ ఇంటి వాళ్లను అడగగా.. పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు కూడా ఘటనపై ఆరాతీయగ .. జడ్జీ ఇంట్లో వాళ్లనుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై దేశంలో దుమారంచెలరేగింది. ఈ క్రమంలో వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహబాద్ కు బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అలహబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది.

ఇప్పటికే తమ మీద  భారీగా పనిభారం ఉందని.. తమకు ఇలాంటి మరకలు ఉన్న జడ్జీలు ఎందుకని.. ఇదేం చెత్తకుప్ప కాదని కూడా సుప్రీంకోర్టుకు లేఖను రాశారు.ఈ క్రమంలో జడ్జీ ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై తాజాగా.. ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది . జస్టిస్ యశ్వంత్ వర్మను.. అన్నిరకాల న్యాయపరమైన విధుల నుంచి దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Read more: Viral Video: ఉత్సవంలో పెను విషాదం.. కళ్ల ముందే కుప్పకూలీన 120 అడుగుల రథం.. వీడియో వైరల్..

ఈక్రమంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫైర్ సెఫ్టీ అధికారులు... జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలపై నివేదిక, వీడియో లు కూడా సమర్పించారు . దీనిపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంను విచారణకు నియమించారు. ఈ కమిటి విచారణ చేసిన తర్వాత తదుపరి నివేదిక ఆధారంగా న్యాయమూర్తిపై ఎలాంటి చర్యలు తీసుకొవాలో అప్పుడు నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ఒక ప్రకటలో వెల్లడించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News