Delhi CAG Report: ఆప్‌ను వెంటాడుతున్న మద్యం పాలసీ, 2 వేల కోట్ల నష్టం

Delhi CAG Report: దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ మరోసారి తెరపైకి వచ్చింది. అధికారం కోల్పోయినా సరే ఆ పార్టీని వెంటాడుతోంది. కాగ్ రిపోర్ట్ ఆయుధంగా చేసుకుని బీజేపీ గత ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2025, 09:12 PM IST
Delhi CAG Report: ఆప్‌ను వెంటాడుతున్న మద్యం పాలసీ, 2 వేల కోట్ల నష్టం

Delhi CAG Report: ఢిల్లీలో గత ప్రభుత్వం అమలు చేసిన నూతన మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇతర మంత్రులు జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ అధికారంలో లేకపోయినా నాటి లిక్కర్ కేసు ఇంకా వెంటాడుతోంది. 

Add Zee News as a Preferred Source

ఢిల్లీ రాజకీయాల్లో కీలకమైన మార్పుకు కారణమైన మద్యం కుంభకోణం కేసులో తాజాగా విడుదలైన కాగ్ రిపోర్ట్ గత ప్రభుత్వాన్ని మరోసారి ఇబ్బంది పెడుతోంది. 2021 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకూ ఢిల్లీలో అమలైన నూతన మద్యం పాలసీలో కుంభకోణం వెలుగు చూడటం, సీబీఐ, ఈడీ దర్యాప్తు, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత మద్యం పాలనీని అప్పుడే ఆప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ అధికారం కోల్పోయింది. అయినా ఇంకా డిల్లీ లిక్కర్ వ్యవహారం నాటి ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.

తాజాగా కాగ్ రిపోర్ట్ విడుదలైంది. 2021-22లో అమలైన నూతన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లిందనేది కాగ్ రిపోర్ట్ సారాంశం. ఏకంగా 2002 కోట్ల మేర ఢిల్లీ ఖజానాకు నష్టం ఏర్పడిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 
నాటి డిల్లీ ప్రభుత్వం చేపట్టిన మద్యం విధానం కారణంగా ప్రభుత్వం 941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ తెలిపింది. ఇక లైసెన్స్ ఫీజుల కింద మరో 890.15 కోట్లు నష్టపోయిందని స్పష్టం చేసింది. లైసెన్స్ దారులకు మినహాయింపుల రూపంలో 144 కోట్లు ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. ఇలా మొత్తం 2002 కోట్ల ఆదాయం ఢిల్లీ ఖజానాకు నష్టం కలిగింది. 

ఇప్పుడు ఈ కాగ్ నివేదికను ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంపై మద్యం కుంభకోణంపై మరోసారి విరుచుకుపడింది. నిపుణుల అభిప్రాయాలు పరిగణలో తీసుకోలేదని, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగులను అనుమతించిందని కాగ్ ఆరోపించింది. కాగ్ నివేదికలోని ఈ అంశాల ఆధారంగా బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది.

Also read: Thalliki Vandanam: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, ఏప్రిల్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News