Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం.. ప్రజలు ఏం చేస్తున్నారంటే..

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రతతో రోజురోజుకు పెరుగుతోంది. దీంతో  గాలి నాణ్యత క్రమంగా తగ్గుతోంది.  ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీలో ఉద్యమకారులు  ఆందోళనలకు దిగారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 10, 2025, 10:06 AM IST
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం.. ప్రజలు ఏం చేస్తున్నారంటే..

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన విభాగం. ఇక గత 28 యేళ్లుగా అక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పరిపాలించినా కాలుష్య నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఈ యేడాది అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికే యమునా నది ప్రక్షాళన చేపట్టి ఈ యేడాది స్వచ్ఛమైన యమునా నదిలో ఛాట్ పూజలను నిర్వహించారు. ఇక వాయు కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కార్యాచరణ నియమించింది. దానిక మరో రెండు మూడు నెలల వ్యవధి పట్టనుంది. ఈ లోగా చలికాలం రావడంతో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో  వివిధ వర్గాల ప్రజలతో పాటు  పర్యావరణ కార్యకర్తలు,  ఆదివారం రాత్రి ఇండియా గేట్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా చిన్నారులతో కలిసి అనేక మంది మహిళలు హాజరై, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Add Zee News as a Preferred Source

స్వచ్ఛమైన గాలిని అందించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్‌ హయాంలో ఢిల్లీ గ్రీన్‌ క్యాపిటల్‌గా ఉండేదన్నారు.  ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ నాయకులు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.

చాలారోజులుగా ఢిల్లీని వేధిస్తున్న సమస్య కాలుష్య సమస్య అన్నారు.  దీనిపై ప్రభుత్వాలు  సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.  ఇది రాజ్యాంగ హక్కులను అతిక్రమించడమే అని ఆరోపించారు. దాదాపు 10 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నామన్నార.  ప్రజల ఆరోగ్య, హక్కుల గురించి ఎవరూ ఆలోచించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. 

అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా గేట్‌ వద్ద నిరసనలకు దిగారని పేర్కొంటూ పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇండియా గేట్​ నిరసనల ప్రాంతం కాదన్నారు. వీఐపీ రాకపోకలతో పాటు భద్రత కారణాల దృష్ట్యా బలగాలను మోహరించినట్లు చెప్పారు. నిరసనల కోసం నిబంధనల ప్రకారం జంతర్​ మంతర్​ వద్ద అనుమతి తీసుకుని చేపట్టాలని సూచించారు. కాగా, ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఉదయం సమయంలో గాలి నాణ్యత సూచిక 391గా నమోదు కాగా ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రం 4 గంటల సమయంలో గాలి నాణ్యత సూచిక 370గా నమోదైంది.అయితే బీజేపీ ప్రభుత్వం .. మాత్రం మేము వచ్చి నెల్లలోనే యమునా కాలుష్యాన్ని తగ్గించాము. ప్రస్తుతం వాయు కాలుష్యం తగ్గించడంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే ఈ కాలుష్యాన్ని అంతకంతకు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. 

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News