1984 Anti Sikh Riots: దేశ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు నిరసనగా ఢిల్లీలో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లు హింసాత్మకమయ్యాయి. ఈ కేసులో అప్పటి కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవితఖైదు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరణశిక్షను మాత్రం తిరస్కరించింది.
1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం దేశ రాజధాని ఢిల్లీలో ఓ పెద్ద గుంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. లూటీలు, అత్యాచారాలు, గృహదహనాలు జరిగాయి. అదే సమయంలో అంటే 1984 నవంబర్ 1వ తేదీన సరస్వతి విహార్ ప్రాంతంలో ఓ అల్లరి మూక జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ సింగ్ ఇంటిపై దాడి చేసి హతమార్చింది. జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ అల్లర్లకు , ఆ గుంపుకు నేతృత్వం వహించింది అప్పటి కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ అనేది ప్రధాన అభియోగం. ఇందుకు తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నందున ఢిల్లీ కోర్టు మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. ఇవాళ ఇతనికి జీవితఖైదు శిక్ష విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. మరణశిక్ష విధించాలనే జస్వంత్ సింగ్ భార్య అభ్యర్ధనను కోర్టు పరిగణలో తీసుకోలేదు.
సజ్జన్ కుమార్ నేపధ్యం
ఢిల్లీలో ఓ బేకరీ యజమాని నుంచి సంజయ్ గాంధీతో సంబంధాలతో ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత తొలిసారి 1980 ఔటర్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. 1991, 2004లో కూడా అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2018లో తొలిసారిగా సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది
జస్వంత్ సింగ్, తరుణ్ సింగ్ హత్యపై 1991లో కేసు నమోదైంది. 1994 జూలైలో సరైన ఆధారాలు లేవని విచారణకు ఢిల్లీ హైకోర్టు విచారణకు నిరాకరించింది. 2015 ఫిబ్రవరి 12న సెట్ ఏర్పాటైంది. 2016 నవంబర్ 21న దర్యాప్తు ఇంకా అవసరమని సెట్ స్పష్టం చేసింది. 2021 ఏప్రిల్ 6న సజ్జన్ కుమార్ అరెస్ట్ కాగా మే 5న పోలీసుల ఛార్జిషీట్ నమోదు చేశారు. డిసెంబర్ 21 కోర్టు అభియోగాలు నమోదు చేసింది. గత ఏడాది జనవరి 31న తుది వాదనలు విని 2024 నవంబర్ 8న వాదనలు పూర్తి చేసింది. తీర్పు రిజర్వ్ చేసింది. 2025 ఫిబ్రవరి 12న సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారించింది. ఇవాళ ఫిబ్రవరి 25న జీవితఖైదు శిక్ష విధించింది.
Also read: Public Holiday: రేపు బ్యాంకులు, విద్యాలయాలు అందరికీ పబ్లిక్ హాలిడే ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









