Supreme Court Issues Notice To SBI Not Releasing Unique Numbers:  లోక్ సభ ఎన్నిలక వేళ దేశంలో  ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్పీఐకు పలుమార్లు మోట్టికాయలు కూడా వేసింది. రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేలా తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు చెల్లవంటూ గతంలోనే తీర్పువెలువరించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, చీఫ్ జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ నేతృత్వలోని  ఐదురుగు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్ల ప్రక్రియ క్విడ్ ప్రోకో అనే దానికి దారితీసే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయ పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..


 రాజకీయా పార్టీలకు విరాళాలు ఇస్తే వారి పేర్లు రహాస్యంగా ఉంచడం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఇది పూర్తిగా ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘించడమే అని కోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిలో భాగంగానే.. 2019 సంవత్సరం నుంచి ఏప్రిల్ 12 వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్లపై పూర్తి వివరాలను మార్చి  6 వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ఎస్పీఐకి ఆదేశించింది. అదే విధంగా మార్చి 13 లోగా.. ఎన్నికల బాండ్ల పూర్తివివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చాలని  కూడా కోర్టు ఈసీనీ ఆదేశించింది. ఎన్నికల బాండ్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 


Read More: Petrol Diesel Prices: వాహనదారులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు


ఇదిలా ఉండగా.. ఎస్బీఐ ఇటీవల ఎన్నికల సంఘానికి బాండ్ల వివరాలను అందజేసింది. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఎస్సీఐ దాఖలు చేసిన బాండ్ల వివరాలు సరిగ్గా లేవని,డేటా అసంపూర్తిగా ఉందని సుప్రీం వ్యాఖ్యలు చేసింది. ఇక.. బాండ్ల నంబర్లతో సహా పూర్తి వివరాలను తిరిగి సమర్పించాలని సుప్రీం కోర్టు ఎస్పీఐని ఆదేశించింది. తాజాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారో పూర్తి వివరాలు బహిర్గతం కానున్నాయి. దీంతో ఎన్నికల బాండ్ల వివాదం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter