
Dharmasthala: ఇప్పటికే 12చోట్ల కీలక సమాచారంతో పాటు...డెడ్ బాడీలకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. 13వ ప్రాంతంలో ఎక్కువ మందిని పూడ్చి పెట్టినట్లు... పారిశుద్ధ్య కార్మికుడు భీమ ఇప్పటికే సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ కనీసం 10మంది మృతదేహాలను పూడ్చినట్లు తెలిపారు. దీంతో ఈ ప్లేస్ లో తవ్వకాలపై టెన్షన్ వాతావరణం నెలకొంది.
అందరి చూపు ఈ 13వ ప్లేస్ పైనే ఉంది. తవ్వకాలు చేపట్లిన అధికారులకు ఇక్కడ భీమా చెప్పినట్లుగా పూర్తి ఆధారాలు లభిస్థాయా లేదా అనేదానిపై టెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు ధర్మస్థల అంశంపై మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
2000 సంవత్సరం నుంచి 2015 మధ్య బెళ్తంగుడి పోలీసులు అసహజ మరణాలను నమోదు చేసే రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించినట్లు తెలిసింది. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో అనేక మందిని ఖననం చేశానని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావడం సంచలనాత్మకమైంది. మొత్తంగా శ్రీమంజునాథుడు కొలువైన ఈ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందూత్వంపై విషయం చిమ్మడానికి ఈ కేసును కావాలనే రాజకీయం చేస్తుందనేది కర్ణాటకలో ని జేడీఎస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. మొత్తంగా తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే అని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.